*మాయ....*`
సాలెపురుగు తన నుండి వచ్చిన జిగురుతో గూడు అల్లి, ఆగూట్లో చిక్కుకున్న పురుగులను తిని అదే సుఖంగా భావిస్తుంది.
కానీ ఆ గూడు నుండి బయటపడే మార్గం తెలియక అదే గూడులో చిక్కుకొని మృత్యువాత పడుతుంది.
అలాగే మనిషి కోరికల వలయాన్ని తనచుట్టూ అల్లుకొని కోరికలు తీరడమే లక్ష్యం అనుకొని అంతకు మించి సుఖం లేదని అనుకుంటాడు.
నిజం తెలిసేనాటికి తాను అల్లుకున్న గూడు కంచు కోటలా మారడం వల్ల బయటపడే మార్గం తెలియక, మాయవల్ల ఏర్పడ్డ గోడలు బ్రద్దలు కొట్టలేక అందులోనే పడి అసువులు వదులుతున్నాడు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
No comments:
Post a Comment