ఈ భూమిపై ఏం చేయాలి? ***
బాబు: ఆ ప్రశ్నకు సమాధానం దొరికేవరకు ఏమీ చేయకుండా మీరు కూర్చోలేదు కదా! ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారుగా... అంతే....ఏ సమయానికి ఏం చేయాలో అది చేస్తూ వెళ్లిపోవడమే చేయవలసింది. జీవితలక్ష్యం అనేది మనం పెట్టుకున్నాం. మిగతా ఏ జీవులూ జీవితలక్ష్యం పెట్టుకోలేదు. వాటికి జీవించడమే జీవితలక్ష్యం.
అలానే మనిషి కూడా జీవితలక్ష్యాన్ని పెట్టుకున్నా, పెట్టుకోకున్నా జీవితం దానికదే సఫలం అవుతుంది అనే విషయం గ్రహిస్తే చాలు. హెచ్చుతగ్గులు అనేవి మనిషి మనసులో నుంచి తొలిగిపోతాయి. మనసుకు అటువంటి సమతుల్యత కలిగే దిశగా ప్రయాణించడమే నాగరికత అభివృద్ధి అంటే. అంతేగాని మిద్దెలు మేడలు పెరగడమో, ఊపిరి సలపని మూర్ఖపుజీవితాన్ని గడపడమో నాగరికత అభివృద్ధి కానేకాదు. జీవనసాఫల్యం అనేది మన ప్రయత్న అప్రయత్నాలతో ముడిపడి ఉండదు.
ఇదొక అడవి...
అడవిలో ప్రతి మొక్కకూ ఓ ప్రత్యేకత ఉన్నట్లే, ప్రతిజీవికీ తనకంటూ ఓ ప్రత్యేకత ఉండనే ఉంటుంది.
మనకు లాభం ఉండడం, ఉండకపోవడం అనే కోణం నుంచిఎదుటవాని గొప్పతనాన్ని నిర్ధారించకూడదు. మనకు పనికిరాకపోతే “పిచ్చిమొక్క” అంటున్నాం. ఇది సరికాదు.
No comments:
Post a Comment