Monday, August 5, 2024

****ఒకరు: అసలు ఆలోచనలు లేని స్థితి జ్ఞానేతరులకు కలుగతుందా? దానిని ఎట్లా సాధించాలి? నేను-నేను అంటూ ఆత్మనిష్ఠలో ఉంటే కలుగుతుందా?

ఒకరు: అసలు ఆలోచనలు లేని స్థితి జ్ఞానేతరులకు కలుగతుందా? దానిని ఎట్లా సాధించాలి? నేను-నేను అంటూ ఆత్మనిష్ఠలో ఉంటే కలుగుతుందా? ***

బాబు: పిల్లవాడి అల్లరిని మాపడానికి పిల్లవాణ్ణి అంతం చేయడంసరియైన మార్గం కాదు కదా!

పిల్లవాణ్ణి బుజ్జగించి తండ్రి యొక్క గొప్పతనం చెప్పి మంచి చేసుకోవాలి. అలాగే ఆత్మ అనే తండ్రిలోంచే మనస్సనే పిల్లవాడు వచ్చాడు. అది తుంటరే అయినప్పటికీ నీ యధార్థస్వరూపం ఆత్మయే అని విషయాన్ని దానికి గుర్తుచేస్తూ ఉండడమే సత్సంగం. 'ఆలోచలనలు లేకపోవడం జ్ఞానస్థితి' అనే తప్పుడు అభిప్రాయం ముందు వదలాలి. నిద్రలో, మూర్ఛలో తలపులు ఉండవు. అంతమాత్రానికే అవి జ్ఞానస్థితులా? నిద్ర, మూర్ఛ అనేవి జడస్థితులు కదా! 'ఆలోచనలే నీవు’

ఆలోచనలే లేకుంటే నీవే ఉండవు. ఆలోచనలు
లేకుండా చేసుకోవాలనేది కూడా ఓ ఆలోచనే.
మనస్సును అంతం చేయాలనుకోవడం, తన
నీడను గుంట తీసి పాతి పెట్టి పూడ్చేయాలనుకోవడమే.
అది సదా నీ వెంటే ఉంటుంది.

దేవునిమనస్సు పేరు - మాయ.
జీవుని మాయ పేరు - మనస్సు.
మనస్సును లేకుండా చేయడం అంటే
'ఆత్మకు విడిగా దానికి ఉనికి లేదు'
అని గ్రహించడమే. ఆత్మప్రకాశంలోని కిరణాలు ఆలోచనలు...

No comments:

Post a Comment