*🕉️🙏జీవితం-మరణం* 🕉️🙏
*🕉️🙏ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం.🕉️🙏*
*🕉️🙏మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి. 🕉️🙏*
*🕉️🙏 మనిషి వేసే ప్రతీ అడుగూ మరణానికి దగ్గర చేసేదే !* *నేడు జీవితం, రేపు మరణం అన్న భావనతోనే జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి.🕉️🙏*
*🕉️🙏తెలిసిన ప్రపంచం నుంచి తెలియని లోకానికి ప్రయాణమే మరణం. 🕉️🙏*
*🕉️🙏కానీ, మనిషి దీన్ని గుర్తించడు,*
*మరణమనే మాటనే జీర్ణించుకోలేడు. 🕉️🙏*
*🕉️🙏ఇప్పట్లో చావు తన దరికి రాదనుకుంటాడు.*🕉️🙏
*🕉️🙏ఈ భావనే అతణ్ని మోసానికి గురిచేస్తుంటుంది. 🕉️🙏*
*🕉️🙏కానీ, నిత్యం మరణాన్ని గుర్తుంచుకున్న వారే వివేకవంతులు.🕉️🙏*
*🕉️🙏‘చివరకు ప్రతి మనిషీ మరణిస్తాడు.*
*ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైనప్పుడు వ్యవధి ఉండదు.🕉️🙏*
*🕉️🙏‘ఎవరికైనా మరణ సమయం సమీపించినప్పుడు..*
*ఆ వ్యక్తి ...*
*‘భగవాన్ నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు. 🕉️🙏*
*🕉️🙏నేను దానధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయేవాణ్ని కదా?’*
*అని వాపోయే పరిస్థితి రాకముందే మంచిని ఆచరించండి. 🕉️🙏*
*🕉️🙏ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు, దైవం అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు’. 🕉️🙏*
*🕉️🙏‘ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు. 🕉️🙏*
*🕉️🙏అంత్యకాలం సమీపించినప్పుడు, ఒక్క ఘడియ కూడా వెనుకా ముందూ కాజాలదు’*
*శరీరమున్నప్పుడే చేతనైనంత మంచిని ఆచరించు,*
*సత్కర్మలలో పాల్గొను,*
*ఆర్థిక శక్తి చాలకపోతే,*
*చెవుల ద్వారా మంచిని విను,*
*కళ్ళ ద్వారా మంచిని చూడు,*
*నోటి ద్వారా మంచి పలుకు,*
*కాళ్ళను మంచి వైపుకి నడిపించు,*
*చేతులతో మంచి పనుల్లో సహకారం అందజేయు...🕉️🙏*
*🕉️🙏అందుకే !!...🕉️🙏*
*🕉️🙏శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం’’*
*అన్నాడు*
*మహాకవి కాళిదాసు.*🕉️🙏
🕉️🙏🕉️
No comments:
Post a Comment