Monday, August 5, 2024

****చలాచల బోధ:

 చలాచల బోధ:--
మనలో ఒక్క 'నేను' తప్ప అన్నీ మార్పు చెందేవే.అనగా శరీర ప్రాణేంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ అనిత్యం.నేను మాత్రం మారకుండా, సాక్షీభూతంగా పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా మారకుండా ఉంటున్నది.కావున ఈ 'నేను'గురించి విచారణ చేయాలి.శ్రీ రమణ మహర్షి వారు ప్రబోధించినట్లు 'నేను'ఎవరు?అని విచారణ చేసి.ఈ 'నేను' నిత్యమో..అనిత్యమో తరువాత తెలుసుకుందాము.ఇప్నటికైతే స్థూల శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ అనిత్యము అనగా జడము లేక అనాత్మ.కాని అజ్ఞానంలో నేను అనాత్మయైన మనసుతో కూడి అసత్య నేనుగా వ్యవహారం చేస్తున్నది.ఏ విధంగా ఈ నేను వేరు,మన‌సు వేరు అని విచారణ చేసి, నిశ్చయించుకుంటారో,దానిని ఆత్మానాత్మ వివేకము అని అంటారు.ఇట్టి విచారణ ద్వారా 'నేను'ను మనసు నుండి వేరు పరచుకొనిన వాడు సకల మనోవ్యాపాలములకు సాక్షీభూతం అవుతాడు.అనగా స్థూల,సూక్ష్మ, కారణ శరీరాలకు విలక్షణమవుతాడు.జాగ్రత్స్వప్నసుషుప్తులకు సాక్షి అవుతాడు.అయితే ఈ నేనే ఆత్మ అవునో కాదో విచారణ చేయవల‌సి యున్నది.

No comments:

Post a Comment