*అమృతం గమయ - సత్ చిత్*
మన హృదయాన్ని నిష్కల్మషంగా అణకువగా ఉంచితే అప్పుడు భగవంతుడు ప్రకాశిస్తాడు.
సేవ, అణకువ, హృదయ పవిత్రత అనేవి శీలసంపదకు పునాదులుగా నిలుస్తాయి. అవి లేకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధ్యపడదు. ఈ గుణాలను పెంపొందించుకునేందుకు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయాలి, అంతట తప్పక భగవత్సాక్షాత్కారం కలుగుతుంది.
భగవంతుడిని తల్లిగా, తండ్రిగా, మన సర్వస్వంగా భావించగలిగితే భయము, గర్వము, అహంకారం వంటి దుర్గుణాల అలజడి తగ్గి హృదయం శాంతిస్తుంది. హృదయం ఆ విధంగా నిష్కళంకంగా రూపొందితే మనలో దివ్యత్వపు ఉనికి స్పష్టమౌతుంది.
ఆ ఉనికి బాహ్యజీవనంలోనూ వ్యక్తమవుతుంది. దివ్యత్వానికి స్వార్థం ఉండదు కనుక అది ప్రతీమాటలోనూ, ఆచరణలోనూ, ఆలోచనలోనూ బహిర్గతం అవుతూ ప్రపంచానికి అందుతుంది.
No comments:
Post a Comment