🪷🙏🏻🪷🙏🏻🪷
*శ్రీ గురుభ్యోనమః*
*బాధ - నీతి*
*ప్రశ్న : మనమంతా విముక్తులమే, మనకే బంధమూ లేదు, మనం భగవంతుని నుండి నిప్పు కణాల వలె వచ్చాం. తిరిగి ఆయననే చేరుతామంటారు శ్రీ శంకరాచార్యులు. అట్లా అయితే, అన్ని రకాల పాపాలనూ ఎందుకు చేయకూడదు ?*
*జవాబు :* మనకి, ఆత్మకీ బంధంలేని మాట నిజమే ! చివరికి, నీ మూలంలో నీవు చేరుతావన్నదీ నిజమే ! ఈ లోగా నీవనే పాపకార్యాలు చేస్తే వాటి ఫలితాన్ని అనుభవించాల్సిందే, దానిని తప్ఫించుకోలేవు. ఎవరైనా వచ్చి నిన్ను బాదుతూంటే .. "నేను విముక్తుడ్ని, ఈ దెబ్బల వల్ల నాకే బంధమూ లేదు, నాకే బాధా లేదు, వాడు కొట్టితే కొట్టనీ" అనగలవా ? అట్లా నిజంగానే నీకనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు నీవు చేయవచ్చు. "నేను విముక్తుడ్ని" అని పెదవులతో అనటంలో అర్థమేమిటి ?
*ప్రశ్న : ప్రపంచమంతా ఈశ్వరుని లీల అని, అంతా బ్రహ్మమయమనీ అంటారు. అటువంటప్పుడు దురభ్యాసాలని విడనాడాలని ఎందుకంటారు ?*
*జవాబు :* మనిషి శరీరంలో ఒక పుండుందనుకో, శరీరంలో కొంచెం భాగమే నంటూ నిర్లక్ష్యం చేస్తే అది శరీరానికంతా నొప్పిని కలిగిస్తుంది. మామూలు వైద్యంతో నయం కాకపోతే, డాక్టరు వచ్చి కత్తితో దానిని కోసివేసి ఆ మాలిన్యాన్ని తీసివేయ వలసి వస్తుంది. ఆ భాగాన్ని తీసివేయకపోతే కుళ్ళుతుంది. తీసివేసిన తరువాత సరిగ్గా కట్టు కట్టకపోతే, చీము పడుతుంది. ప్రవర్తన విషయమూ అంతే ! దురభ్యాసాలు, దురలవాట్లూ దేహంలో కురుపువంటివే ! ప్రతి రోగానికీ తగిన వైద్యాన్నివ్వాలి.
*"నీ సహజస్థితిలో ఉండు"*
*భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment