చలాచల బోధ:--
మన స్వభావములో కూడా ఈ రెండు గుణాలు ఉన్నాయి.మనలోని తమోగుణము వలన మన ఆత్మ మనకు తెలియదు.దీనిని ఆవరణ అని అంటారు.మనలోని రజోగుణము వలన మన ఆత్మకు బదులు అనాత్మ యైన శరీర త్రయమే నేను అనే విక్షేపము కలుగుతుంది.అలాగే పంచకోశాలు నేను అనే విక్షేపము కూడా కలుగుతుంది.అంతటా ఉన్న బ్రహ్మ గోచరించద.బదులుగా ఈ కల్పిత జగత్తు గోచరిస్తుంది.ఈ తమోగుణ రజోగుణ జంటను అవిద్య అని అంటారు.మనలోని అవిద్య వలన మనకు ఆవరణ మరియు విక్షేప దోషముల వలన ఆత్మను మరిచి, అనాత్మ యైన మూడు శరీరాలను,పంచకోశాలను నేను అని అనుకోవడమే అజ్ఞానం అనబడుతుంది.అవిద్యా దోషము పోగానే నేను ఆత్మను లేక అహం బ్రహ్మ అనే జ్ఞానం కలుగుతుంది.
ఉదాహరణకు మన కన్ను తనను తాను చూడజాలదు.బదులుగా మన కన్ను బాహ్యమైన శబ్ద స్పర్శ రూప రస గంధములను గ్రహిస్తుంది.అనేక విషయాలను గ్రహించడమే కాకుండా ఆ విషయాలతో తాదాత్మ్యత చెందుతుంది.అటువంటి తాదాత్మ్యత వల్లనే ఈ "నేను"నిజంగా ఆత్మ అయియున్న తనను ఆత్మ లక్షణాలను అనుభవించకుండా తాను కానటువంటి స్థూల శరీరం నేను అనియు, సూక్ష్మ శరీరం నేను అనియు,కారణ శరీరం నేను అనియు ఈ శరీరానుసారమైన అనుభవాలను పొందుతూ ఉంటుంది.అవిద్యా దోషమే ఈ శరీరానుసారమైన జీవితాన్ని అనుభవిస్తూ, ఇంద్రియ భోగాలే ఆనందము అని అనుకుంటూ.తనను తాను ఈ సంసారములో బంధించుకొని నాడు ఈ మానవుడు.పుణ్య పాపాలను చేస్తూ ఫలితముగా సుఖ దుఃఖాలను అనుభవీస్తూ, స్వార్థంతోను,కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అనెడి అరిషడ్వర్గమునకు లోబడి,జనన మరణ చక్రంలో తనను తాను బంధించుకున్నాడ.ఎలాగైతే ఒక సాలిపురుగు తనలోని పదార్ధమును బయటకు తెచ్చి సాలిగూడు కట్టుకొని,తన వృద్ధాప్యంలో కదలలేక తన గోళ్ళకు దారాలు బంధించగా, ఆహారం లేక చచ్చి పోవునట్లు మానవుడు తన బంధానికి తానే కారణమవుతున్నాడు.మానవుడు బుద్ధి జీవి గనుక ఆత్మానాత్మ వివేకముతో తన బంధమును తనే విడిపించుకొని బంధ విముక్తుడు కావాలి.అప్పుడే మానవ జన్మ సార్థక మవుతుంది.
సశేషం!
No comments:
Post a Comment