Friday, August 30, 2024

 🪷🙏🏻🪷🙏🏻🪷

🙏 *రమణోదయం* 🙏

*ఇహ పరాల్లో పొందే అల్ప సుఖానుభవాలపై ఆశలు పెంచుకొని దుఃఖిస్తున్న ఓ మనసా! నీవు ఎటువంటి తలపులు లేకుండా నీ సహజ స్థితిలో ఉంటే ఇహపరాలని దాటిన బ్రహ్మానంద ముక్తిని నిశ్చయంగా పొందుతావు.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.379)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹
               
*శ్రీ గురుభ్యోనమః*

      నీ హృదయంలో  ఒక  నిజం  ఉంది !  నీ హృదయంలో  ఒక  సత్యం  ఉంది !  చావులేని  ఆ పదార్థం  గురించి  తెలుసుకుంటేనే  గాని,  చావులోంచి  నువ్వు  బయట  పడలేవు.  పుట్టినవాడు  చనిపోతూ  ఉంటాడు,  చనిపోయినవాడు  పుడుతూ  ఉంటాడు.  ఇది  సంసారం.  కోరికలతోనే  నువ్వు  పనులు  చేస్తావు,  కోరికతో  పని  చేయటం  మానవు,  కోరిక  వల్లే  సంసారం  కూడా  వస్తుంది. 

*భగవద్గీతలో  చెప్తాడు ..  కామ్యకర్మలు  చేసినంతకాలం ..  మనిషివెంట  నీడ  ఏవిధంగా అయితే  వెంటాడుతుందో,  అదేవిధంగా  కోరికలు  కోసం  పనిచేసేవాడికి,  సంసారం  ప్రతీజన్మలో  నీడలా  వెంటాడుతుంది.*  
కొంతమంది  ఉంటారు ..  మీరు  మాకేమీ  ఉపకారం  చెయ్యద్దు,  మా ముఖంవంక  చూసి  కొంచెం  నవ్వుండి  చాలు  అంటే  నవ్వరు.  నవ్వితే  మాకేం  కలిసి  వస్తుందని !  వాళ్ళకి  నవ్వటం  వల్ల  కూడా  కలిసి  రావాలి.  మా ఇంటికి  వస్తే  మీరేం  తెస్తారు ?  మీ ఇంటికి  వస్తే  మాకేం  ఇస్తారు ?  ఇదీ ..  ఇప్పుడు  సిద్ధాంతం !  వీళ్ళకి  సంసారం  ఏం  విడిచిపెడుతుందన్నాడు  భగవవద్గీతలో  భగవంతుడు !  కృష్ణుడంటే ..  ఊరికే  వసుదేవుడు  గారి  అబ్బాయి  అయి  చెప్పలేదు.  ఆయన  పరబ్రహ్మమై  చెప్పాడు,  పరిపూర్ణుడై  చెప్పాడు,  ఈశ్వరుడై  చెప్పాడు,  సర్వజ్ఞుడై  చెప్పాడు,  నారాయణుడై  చెప్పాడు అది  *భగవద్గీత !!*

*శంకరాచార్యులవారు  అన్నారు ..*  ఎన్ని  పుస్తకాలకైనా  వ్యాఖ్యానం  వ్రాయచ్చు  కానీ,  *భగవద్గీత* కు  వ్యాఖ్యానం  రాయటం  కష్టం.  భగవంతుడు  చెప్పిన  మాటకు  లోతు  ఎంతుందో నాకు  తెలియటం  లేదు  అన్నారు ఆచార్య స్వాములవారు.  

*శ్రీ నాన్నగారి  అనుగ్రహ  భాషణం -*
*మురమళ్ళ :*  2005 / 02 / 09 
                        
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment