*"కర్మ బంధం"*
*'మనిషిగా పుట్టిన ప్రతీవాడికీ అనేక ఋణాలున్నాయి. వాటి నించి స్వచ్ఛందంగా ఋణ విముక్తుడు అవడం ఎలా?” అన్న అంశం మీద మన సనాతన సాంప్రదాయం ఇలా చెపుతుంది."*
*దేవ ఋణం:-*
*******
*"ఈ జీవితాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడిని నిరంతరం స్మరించడం ద్వారా, పూజ ద్వారా దేవ ఋణాన్ని తీర్చుకోవచ్చును".*
*ఋషి ఋణం:-*
*******
*"మనకు ఋషులు సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రసాదించారు. వారి స్మరణతో ఆ ఋణ విముక్తి కలుగుతుంది."*
*పితృ ఋణం:-*
*******
*"ఈ శరీరానికి జన్మనిచ్చిన తల్లి తండ్రులు వంశ కర్తలు, వారి పేరు ప్రఖ్యాతులు ఇనుమడించేట్లుగా ప్రవర్తించడం ద్వారా, అలాగే వారికి పితృ తర్పణాలు వదలడం ద్వారా వారి ఋణం తీర్చుకోవచ్చును".*
*భూత ఋణం:-*
****
*"మన జీవన యాత్రలో కనబడే పశు, పక్షి, వృక్ష, క్రిమి కీటకాదుల పట్ల దయ కలిగి ఉండటం, వాటికి ఆహారాది వితరణ చేయడం ద్వారా భూతఋణం తీర్చుకోవచ్చును."*
*మనుష్య ఋణం:-*
*******
*"సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో పాలు పంచుకుని దీనులకి తగిన సహాయం చేసి వారి దుఃఖాన్ని తొలగించడం ద్వారా మనుష్య ఋణాన్ని తీర్చుకోవచ్చును".*
*"మనం ధర్మమైన కర్మాచరణ చేస్తే, అది కర్మ బంధం కాకపోగా, పాత కర్మలు తొలగి కర్మ బంధంలో చిక్కుకోం. పైగా ఆ చిక్కుల్లోంచి బయటపడతాము."*
No comments:
Post a Comment