*అసలు ధర్మం అంటే ఏమిటి?*
********
*"ధారణా ధ్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః!!"*
*భావం:-*
*"ఏది ఒక వ్యవస్థని విచ్ఛిన్నం కానీయకుండా ధరించి ఉంటుందో అదే ధర్మం. ధర్మమే ప్రజలని ఛిన్నాభిన్నం కానీయకుండా ధరించి కాపాడుతుంది. ఏది ధర్మమో, ఏది కాదో మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. తెలిసీ అధర్మం చేస్తూంటాం. ఎందుకు? దుర్యోధనుడు మనందరిలోనూ ఉన్నాడు కాబట్టి".*
*"జానామి ధర్మం న చ మే ప్రవృత్తిః!*
*జానామి అధర్మం న చ మే నివృత్తిః!!"*
*భావం:-*
*"ధర్మమని తెలిసీ ఆచరించలేను. అధర్మమని తెలిసీ వదలలేను. అని దుర్యోధనుడు చెప్పాడు."*
*"వ్యాసుడు ధర్మాన్ని ఇలా నిర్వచించాడు. ఈ ధర్మాన్ని అతిక్రమించడం దుష్కర్మే అవుతుంది."*
*"యదన్యైద్విహితం నేచ్చేతో ఆత్మనః కర్మ పురుషః!*
*న తత్పరేషు కుర్వత ఏష ధర్మ స్సనాతనః!!"*
*"భావం:-*
*"ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల విషయంలో నువ్వు చేయద్దు. ఇదే సనాతన ధర్మం.*
*"మహాత్ములు, ఏది పాపం? ఏది పుణ్యం? అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోడానికి ఒకే 'లిట్మస్ టెస్ట్' ఇచ్చారు".*
*"అధర్మం అంటే ఏమిటి?"*
*****
*"ధర్మానికి విరుద్ధమైనదంతా అధర్మమే. మనం చేసే అనేక దుష్కర్మలన్నీ అధర్మాలే.
No comments:
Post a Comment