Monday, August 12, 2024

****ఆత్మజ్ఞానానికి ఏ సాధన అవసరం లేదని రమణమహర్షి ఎందుకు అన్నారు?

 ఆత్మజ్ఞానానికి ఏ సాధన అవసరం లేదని రమణమహర్షి ఎందుకు అన్నారు?
సాధనలన్ని వదిలేసి ఖాళీగా కూర్చోమని భగవాన్ ఎప్పుడు చెప్పలేదు. వారి వద్దకొచ్చిన అనేక మంది సాధకులకి, వారి వారి పరిణతకి తగ్గ జప, ధ్యానాది సాధనలు సూచించి ప్రోత్సహించేవారు. మనవంటి సామాన్యులు భక్తి, ధ్యానాది సాధనలు వదలరాదు. మహాత్ముల బోధలు సమగ్రంగా పరిశీలించకపోవటం వలన ఇటువంటి సందేహాలు వస్తాయి.

భగవాన్ రమణులన్న ఆ మాటకు తాత్పర్యం వేరు..

తన రూపు ఎలా ఉంటుందో మర్చిపోయిన ఒక వ్యక్తి ఒక సరస్సు ఒడ్డున తన ప్రతిబింబాన్ని చూద్దామనుకుని ఆ సరస్సులోకి తొంగిచూసాడు. కానీ, ఆ సరస్సు బాగా మురికిగా ఉండి, తరంగాది చలనం బాగా ఎక్కువగా ఉండటం వలన, అతనికి తన ప్రతిబింబం స్పష్టంగా కనపడలేదు. తన ప్రతిబింబం చూడగలగాలంటే సరస్సు ఎలా ఉండాలి? మురికి లేకుండా ఉండాలి, చలనం సద్దుమణిగి ఉండాలి. అలా ఉంటే ప్రతిబింబం చూడటానికి పెద్ద కష్టపడక్కరలేదు. నిజానికి ఎటువంటి మాలిన్యం లేని, చలనరహితమైన సరస్సు నీటికి తన ఎదురుగానున్న వస్తువును ప్రతిబింబించటమనేది సహజలక్షణం.

కొలనులో తన రూపు చూసుకున్న వ్యక్తికి తన ముఖము, రూపు కొత్తగా లభించినది కాదు, అది నిత్యలభ్యము. అలాగే, ఆత్మజ్ఞానము పొందుట అంటే ఏదో కొత్తగా అవటం కాదు. ఉన్నదాన్ని ఇప్పుడు ఇక్కడ అనుభవపూర్వకంగా గుర్తించటం. ఆత్మనేది ఎక్కడో కూర్చున్న బండరాయి కాదు. ఆత్మజ్ఞానమనేది కాలము, దేశములో చేసే ప్రయాణము కాదు. ఆత్మంటే మనమే. దుఃఖము, చావు స్పర్శలేని సచ్చిదానంద ఘనుడవై నీవు ఇప్పుడు ఇక్కడ అయి ఉన్నావు, కానీ అది మన అనుభవములో లేదు. దాన్ని గుర్తించటం, మనము మన నిజ స్వరూపమునందు ఉండుటయే ఆత్మజ్ఞానం.ఆదిత్యయోగీ.

మరి ఈ విషయాన్ని గుర్తెరిగి, మన స్వరూపమునందు స్థిరమై ఎందుకు ఉండలేకపోతున్నాము? మనసు వలన. అతి చంచలమై, రాగద్వేషాది మలినములు కలిగిన మనసే అసలు అడ్డు. అటువంటి మనసు ఆ మురికి కొలను వంటిది. మన స్వరూపము స్పష్టంగా తెలిసికొననివ్వదు. శుద్ధమై, ఏకాగ్రమైన, ప్రశాంతమైన మనసు , కొలనులోని మంచినీటివలె ఆత్మచైతన్యాన్ని స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. అటువంటి చిత్తములో పరమాత్మ సమాహితుడై ఉంటాడు. అటువంటి మనసు తన మూలమైన ఆత్మచైతన్యమునందు సహజంగా విలీనమౌతుంది.

జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః (భగవద్గీత 6.7)

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ (భగవద్గీత 6.25)

భక్తి చేసినా, నిష్కామ కర్మానుష్ఠానము చేసినా, యమనియమాది సహిత ధ్యానాదులవలింబించినా, నేతి నేతి అని బౌద్ధికంగా వెదికినా, ఏ సాధనైనా వాటన్నిటి లక్ష్యం ఏకాగ్ర చిత్తశుద్ధి, ఆత్మనిష్ఠ. ఆత్మజ్ఞానము కొత్తగా లభించే వస్తువు గాదు. అది నిత్యలభ్యము. దానిని గుర్తెరుఁగుటకు అడ్డువచ్చే భావనలను తొలగించే ప్రయత్నము సమస్త సాధనలు...
.
శ్రీరామకృష్ణులు:....
 ‌‌                       "సామాన్యంగా సమాధిస్థితి పొందిన తరువాత దేహంలో జీవం నిలిచి ఉండదు. కాని నారదాది ఋషులకు ఈ నియమం వర్తించదు: లోకుల ఉపదేశార్థం వీరు సజీవులై ఉంటారు. భగవదవతారమూర్తులైన చైతన్య మహాప్రభువు వంటివారి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. 

బావి త్రవ్వటం పూర్తికాగానే పార, పలుగు, బుట్ట పారవేయటం జరుగుతుంది. కాని కొందరు ఈ పనిముట్లను ఇరుగుపొరుగుల ఉపయోగార్ధం పదిలపరుచుకొంటారు.ఆదిత్యయోగీ.

సమాధి అనంతరం తమ దేహాలను నిలుపుకొనివుండే మహాపురుషులు దుఃఖితులైన జీవులపట్ల కనికరం చెందుతారు.. తమకు కలిగిన జ్ఞానంతోనే తృప్తిచెందే స్వార్ధపరులు కారు వీరు..
.

పతంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలు,  చాలా పురాతన బోధనలు, అవి మౌలిక యోగ సూత్రాలను విశదీకరిస్తాయి, చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామాలే అనుకుంటారు, కానీ అవి అందులో ఒక శాఖ మాత్రమే, యోగా అంటే ధ్యాన మార్గం కూడా, వ్యక్తిని విశ్వ మూలంతో ఐక్యమయ్యే లా చేయడమే దాని లక్ష్యం, యోగ సూత్రాలు ఈ అంశానికి సంబంధించినవి, పతాంజలి వీటిని అష్టాంగయోగంగా పిలవబడే 8 సోఫానాలుగా మనకు అందించారు, ఆ ఎనిమిది మెట్లు ఇవీ.
1. యమ
2. నిమమ
3. ఆసన
4. ప్రాణాయామ
5. ప్రత్యాహార
6. ధారణ
7. ధ్యాన
8. సమాధి

'అష్టాంగ యోగం లోని ఈ ఎనిమిది అంశాలు ముఖ్యమైనవే, అన్నారు.

పరిపూర్ణుడు, ప్రాణాహుతి ప్రసారం చేయగల సమర్ధుడు అయిన గురువర్యుని మార్గదర్శకత్వంలో హృదయం పై ధ్యానించడమే మనం అనుసరించే ప్రక్రియ, ప్రాధాన్యాన్ని చూపించే విషయం. అటువంటి గురువు మన ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధంగా నిలిచే వాటిని దూరంగా ఉంచుతాడు, గురువర్యునుండి ఆధ్యాత్మిక తరంగాలు మన హృదయంలోకి ప్రవహించడం కొనసాగుతూ, రోజు రోజుకి మనల్ని ప్రశాంతంగా, మరింత ప్రశాంతంగా చేస్తాయి. మనం ధ్యానంలో లోతుగా లీనమైతే, మనం అభిలాషిస్తున్న అంతరంగం లోలోపల ఉన్నదానితో మన సంబంధాన్ని అనుసంధానిస్తాం.ఆదిత్యయోగీ.భక్తి మన సామర్థ్యాన్ని పెంచి మార్గం సుగమం చేస్తుంది. మన హృదయాన్ని గురు శక్తికి గురి చేసినట్లయితే, మనం అంతర్ముఖంగా విస్తరించ      నారంభిస్తాం. దాని ఫలితంగా దీర్ఘకాలంలోనే మనం దైవ సామ్రాజ్యమంతా వ్యాపించి ఉండడాన్ని గమనిస్తాం.

దైవిక రహస్యం బయట పోక్క రాదు"
అనుభూతిని చెందండి.

*ఓం తత్సత్*

No comments:

Post a Comment