Pasupula Pullarao 9849163616
రాగం తానం పల్లవి=సంగీతం
ఙ్ఞానం విజ్ఞానం ఆత్మ జ్ఞానం = ధ్యానం
ఖాళీగా ఉన్న గిన్నెలో నెయ్యి పోస్తే నేతి గిన్నె, పాలు పోస్తే పాల గిన్నె, నీళ్ళు పోస్తే నీటి గిన్నె .. గిన్నెలో ఏది పోస్తే ఆ పేరుతో పిలువ బడుతుంది... ఏమి పొయ్యకుంటే ఎంప్టీ గిన్నె.. ఆత్మ అనే గిన్నెలో ఆరోగ్యం,ఆనందం,ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం , కీర్తి ప్రతిష్టలు అనే పంచామృతాలు పోస్తుంటే మనవజీవితం పంచామృతాల మయం అవుతుంది... అందుకు ముందుగా సరైన సాధన ద్వారా గిన్నెను ఎంప్టీ చేసుకోవాలి... ఖాళీ గిన్నెను కావాల్సిన వాటితో నింపడమే ఉంటుంది...
మైండ్ అనే గిన్నెలో ఉన్న ఆలోచనలు సరైన సాధన తో ఖాళీ చేసుకోవాలి ముందుగా... మనసు పని నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది కావున మైండ్ అనే గిన్నెను పాజిటివ్ అలోచనలు అనే పదార్థంతో నింపుతూ ఉందండి...
ఈ అనంత విశ్వం మొత్తం శూన్యం తో నిండి పోయి ఉన్నది... సాధకులు సరైన సాధన ద్వారా ఎంత శూన్యాన్ని ఆక్రమించు కుంటే అంత విశ్వం నీలోనే ఉన్నట్లు...
శూన్యం=ఆరోగ్యం,ఆనందం,ఐశ్వర్యం, ఆత్మ జ్ఞానం.
సరైన సాధన ద్వారా తెచ్చుకున్న పాత్రలు మార్చుకోవచ్చు... జన్మతః వచ్చే పాత్రలు పోషించాలని సృష్టి ఎపుడు చెప్పదు... ఎందుకంటే సృష్టి ఎపుడు నీ ఆలోచనలను బట్టే ఉంటుంది... అందుకే గురువులు దృష్టి (ఆలోచనలు)నీ బట్టే సృష్టి అని సింపుల్ గా చెప్పారు..రామారావు గారు రాముడు, రావణుడు, రారాజు, భీముడుగా నటించినట్లు...
చెప్పడం తేలిగ్గా ఉన్నా వినడం విన సొంపుగా ఉన్నా సరైన సాధన చేస్తేనే సరైన ఫలితాలు.
No comments:
Post a Comment