😃😀 సరదాగా
కోమలి గాఢంగా ఆదమరచి నిద్రపోతోంది. మధ్యరాత్రి ఒంటిగంటకి ఏదో భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ లేచి .. కోమలీ ఏమైంది ? అని అడిగాడు...
ఏదో పీడకల వచ్చింది అన్నది. సరే పడుకో అని పక్కకు తిరిగి పడుకున్నాడు.
అయితే ప్రతిరోజూ రాత్రి ఆ కలలు రావడం ప్రారంభమయ్యాయి.
కృష్ణ ఒకరోజు ఆమెను అడిగాడు, "ఆ కల ఏమిటో చెప్పు, శాస్త్రంలో ఏదైనా శాంతి ఉంటే చేద్దాం" అన్నాడు.
అప్పుడు కోమలి *"ఒక బట్టతల వాడు నడుస్తూ వస్తాడు .. మా దగ్గరికి రా.... మా దగ్గరికి రా అని కేకలు వేస్తాడు.. నాకు భయంగా ఉంది, వాడు యమకింకరుడిలాగానే ఉన్నాడు అంది "* ...
అప్పుడు, కృష్ణ పంచాంగాలన్నీ చూశాడు.. కానీ, ఆమె కలలోని పరమార్థం మాత్రం అతనికి అర్థం కాలేదు.
కృష్ణకు, ఆమె అవస్థ రోజూ చూడలేక ఆమెను ఆ పట్టణంలోని ఓ ప్రముఖ జ్యోతిష్కుల వద్ద సమయం అడిగి వారి వద్దకు వెళ్లారు.
మీ కల గురించి వివరంగా చెప్పమన్నప్పుడు, కోమలి అంతా వివరించింది. వారు ఆమె గురించి, ఆమె రాశి, నక్షత్రం గురించి, అన్ని జాతకాలను చూశారు. కానీ ఆమెకు ఎలాంటి దోషం లేదు అని తేల్చారు.
చివరికి జ్యోతిష్కులు ఉభయులు చర్చించి, ఒక నిర్ణయానికి వచ్చి చెప్పింది ఏమిటంటే.
"మీ కలలో బట్టతల ఉన్న వ్యక్తి వచ్చి మా దగ్గరకు రా... మా దగ్గరకు రా... అని పిలిచేది మరెవరో కాదు, అతను లలితా జ్యువెలరీ అంకుల్ " అని అంటూ.
*"నీ భార్యను అక్కడికి తీసుకెళ్లి బంగారు నగలను కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది" అన్నారు.*
కలలు ఎవరికి ఊరికే రావు.
No comments:
Post a Comment