Monday, October 7, 2024

 7- 10 - 2024 - సోమవారము- శుభమస్తు.
🌹గుడ్ మార్నింగ్ 🌹మనసును బలముగా, ధైర్యముగా ఉంచుకోవాలి. తప్పులు, చెడు పనులు, చెడు ఆలోచనలు చేసేవారికి, అత్యాశ, దురాశ ఉన్నవారికి, ఈర్ష్య, అసూయలతో జీవించేవారికి - మొత్తముగా చెడుగా జీవించేవారికి మనసు - గందరగోళముగా - భయముగా - వ్యతిరేక భావాలను సృష్టించేదిగా ఉంటుంది. దీనివలన జీవితం మొత్తం నరకముగా మారుతుంది. చుట్టూ ఉన్నవారిని కూడా బాధలకు గురిచేస్తాము. జ్ఞానము - విశాలత్వము నేర్పి, అందరిని అన్నిటిని అర్ధం చేసుకునే స్వభావాన్ని పెంచుతుంది. దీని వలన మంచిగా జీవించటం తప్పులు చేయకుండా ఉండటం అలవాటు అవుతుంది. తప్పులు చేయని, మంచి మనసు - అన్నీ మంచి భావాలనే ఉత్పత్తి చేయటం వలన జీవితం ధైర్యముగా, శాంతిగా సాగుతుంది. చుట్టూ వున్నవారుకూడా మనవలన ఆనందాన్ని పొందుతారు......................... మంచి - తృప్తి - ధైర్యము - శాంతి...... చెడు - అత్యాశ - భయము - ఆశాంతి. ఎలా ఉండాలో మన చేతిలోనే వున్నది. మంచి ఆధ్యాత్మికము - చెడు భౌతికము.. ఆధ్యాత్మికము నేర్చుకునేది, సాధన చేసేది కాదు - జీవించేది.......................ఎవరి జీవిత నిర్ణయం వారి చేతిలోనే వున్నది.. 🌹god bless you 🌹

No comments:

Post a Comment