Tuesday, October 8, 2024

 8-10 -2024 - మంగళవారము - శుభమస్తు.
🌹గుడ్ మార్నింగ్ 🌹జీవించటం అంటేనే పరిమిత భావన. నేను అనే పరిమిత భావనలో - నాకు భిన్నముగా అనేకము వున్నాయి అనే భేద భావనలో అవసరాల కొరకు తప్పనిసరిగా ప్రయత్నిస్తూ, అనుభవిస్తూ జీవించటమే జీవితం.......... ఇది మొత్తం శరీరానికి సంబంధించినది...... ఇలా జీవిస్తూనే శరీరాన్ని నడిపే లోపలి మనసును గమనిస్తే - పరిమిత - భేద భావాలు ఉంటాయికాని-అది ఆలసట లేని, అత్యంత వేగవంతమైన, పరిమితులు, పరిధులు లేని శరీరాన్ని మించిన మహా శక్తిలా తెలుస్తుంది............................. ఇది మనో స్థితి................................ ఒక పని పూర్తి అయ్యి - ఒక అనుభవం పూర్తి అయ్యి - రెండవ దానిలోకి ప్రవేశించేలోపు - కాసేపు ఏ ఆలోచన లేకుండా తృప్తిగా,హాయిగా, నిశ్చలముగా ఉన్న అంతరంగ స్థితిని గమనించ గలిగితే.......................... లేదా ఏమి చేయలేక నిస్సహాయముగా, ఏ ఆలోచనా లేక అంతరంగములో ఆగిపోయిన స్థితిని గమనించ గలిగితే....... లేక ఒక్కసారిగా భయానికి లోనై నిశ్చేష్టులై ఉండిపోయిన అంతరంగ స్థితిని గమనించ గలిగితే............................................ ఒక ఖాళీ - ఒక సూన్యత - ఒక నిశబ్దం - ఒక అనంతం అక్కడ దర్శనమవుతుంది...... ఆ నిశ్చల, నిశ్శబ్ద, అనంతములోనే మనసు, శరీరం కదులుతన్నట్టు తెలుస్తుంది. దీనికి నిరంతర గమనిక కావాలి........... అది దొరకనది కాదు.............................. మనము ప్రయత్నించని మన శాస్విత నిజ స్వరూపము................. ఇదే స్వీయ అంతరంగ ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువు. జీవిస్తూ గమనించండి చాలు....... 🌹god bless you 🌹

No comments:

Post a Comment