Tuesday, October 8, 2024

 *ఆత్రేయగీత *

మొదటి భాగం

అధ్యాయము - 7

“విజ్ఞానము”

జ్ఞానమనగా శాస్త్రజ్ఞానం. విజ్ఞానమనగా
అనుభవపూర్వకమైన జ్ఞానము (PRACTICAL KNOWLEDGE).

ఆధ్యాత్మిక విద్యకు అనుభవజ్ఞానమే ప్రధానము. ఆత్మను తెలుసుకొనుటకు జీవునికి జ్ఞానముతో పాటు విజ్ఞానము అవసరము!

అనుభవమునకు రాని విద్యవలన ఉపయోగంలేదని, కేవలం శాస్త్రజ్ఞానంతో ఆత్మానుభూతి పొందలేరు!

శాస్త్రజ్ఞానం అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వాటిమీద జ్ఞానం వుండటం అన్నమాట!

ఎలాగైతే మామిడిపూతంతా పండ్లుగా మారవో. ఆధ్యాత్మికసాధన చేసిన జ్ఞానులందరు వరమాత్మను తెలుసుకోలేరు.

చాలామంది మధ్యలోనే రాలిపోతారు. కొంతమంది అజ్ఞానంతో పూతదశలోనే దూరమౌతారు, ఇంకొంతమంది జ్ఞానంతో ముందుకెళ్లి ఆపిమ్మట విషయవాంఛలతో కాయదశలో పట్టుతప్పుతారు.

ఎంతోమందికి శాస్త్రజ్ఞానం వుంటుంది కానీ అనుభవజ్ఞానము వుండదు. కాబట్టి ఈ రెండింటిని జోడించి అసలు సత్యమును తెలుసుకొనే ప్రయత్నంచేయాలి.

ఒక కార్యమును సాధించుటకు నిర్విరామంగా, పట్టుదలతో చేయు ప్రయత్నమే అభ్యాసము!

తాను గ్రహించిన జ్ఞానంతోనూ, పొందిన అనుభవంతోనూ ఈ అభ్యాసం సాగాలి!

ఈ జన్మలో ఏర్పడిన వికారములు, గత జన్మలనుండి సంప్రాప్తించిన విషయవాసనలు జీవునిలో తొలగిపోవాలంటే నిరంతర అభ్యాసముద్వారా మనస్సుపై పట్టుసాధించాలి.

ఈ అభ్యాసమంతా వైరాగ్యంతో(విషయవిరక్తితో) సాగాలి!

శాశ్వతము కానీ ఇంద్రియసుఖముల వెంట నిరంతరం పరిగెత్తు మనస్సుని శాశ్వతము, సత్యమగు పరమాత్మ వైపు మరల్చాలి!

జ్ఞానము కలిగిన తరువాత వైరాగ్యముతో కూడిన అభ్యాసము చేయాలి! అనుభవపూర్వక జ్ఞానంతో అన్ని జీవులయందు సమదృష్టి కలిగియుండాలి!   *

No comments:

Post a Comment