Friday, October 4, 2024

 రామాయణ, మహాభారత ఇతిహాసాలు మానవ ప్రవర్తనను ఎలా మార్చగలవు. ఈ ఇతిహాసాలు ఏమైనా కార్య నిర్వహణ యందు ఉపయోగపడగలవ?
రామాయణ మహాభారత ఇతిహాసాలు మనిషి ప్రవర్తన ను ఎలా మార్చ గలవు కార్యనిర్వహణయందు ఎలా ఉపయోగపడగలవు?

ముందు శ్రీరామాయణం తీసుకుందాం అబ్బో రాముడిలా ఎలా బతగ్గలం అని నిట్టూర్చేయకండి పోనీ సుందరకాండ లోకి వెళదాం .ఆత్మ పరమాత్మ అని పెద్ద మాటలు కాదు ,నేను అపజయం పొందాను అన్ని ప్రయత్నాలూ అయిపోయాయి ఇంక బతికి ఏం లాభం అని కుదేలైన వ్యక్తికి మార్గదర్శనం చేయగలదా మీ సుందరకాండ .చూద్దాం

ముందుగా రాముడు దేవుడని , సీతమ్మ జగన్మాత అని హనుమ వానరుడని కాసేపు అనుకోవద్దు వాళ్ళందరూ మన లాంటి మనుషులే అనుకుందాం.

హనుమ ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించారు తెలుసా

ఆశ్చర్యంగా ఉందా .వాల్మీకి రామాయణం లోఉన్నదే

నాలుగంగుళాల చోటు వదలకుండా లంక అంతా వెతికాను .సీతమ్మజాడ లేదు .ఏమై ఉంటుంది .సముద్రంలో పడిపోయిందా రాక్షసులు తినేశారా

ఏంచేయను .నన్ను నమ్మి రాముడు పంపాడు .కానీ నావల్ల కాలేదు ఈదుర్వార్త తీసుకుని వెళ్తే రాముడు బతుకుతాడా అది చూసి లక్ష్మణుడూ ప్రాణం వదిలేస్తాడు ,మరి సుగ్రీవుడుండగలడా వారికేమైనా అయితే మిగిలిన వానరులు వారి స్త్రీలు ఎవరు మిగులుతారు .ఇంత మందిని పొట్టను పెట్టుకునే ఈ వార్త మోసుకు వెళ్ళక పోతేనేం .ఇక్కడే ప్రాయోపవేశం చేసి మెల్లిగా ప్రాణం వదిలేస్తా
తరువాత ఏంజరిగింది ?
ఆయన మళ్లీ ఆలోచించాడు . ప్రార్ధించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ ....

మళ్లీ మళ్లీ ఆలోచించాడు శరీరం వదిలి ఏమి ప్రయోజనం ?అసలు ఏం పొరపాటు జరిగిందీ .అది చూద్దాం
ఆ! అశోకవనంలో వెదకలేదు అక్కడ చూడాలి
తరువాత సీతమ్మ దర్శనం సిద్దిసర్గ ఇక విజయ పరంపర
మనకి ఇలాంటి సందర్భాలు ఎదురు కావా .అంటే అపజయం రాగానే మనం చచ్చిపోదామని అనుకోవడమో లేక ఇంక పైకి లేవలేనంత కుంగిపోవడమో

అటువంటి స్థితి లో ఉన్న వారికి ."ఒరేయ్ ఎందుకురా కుంగిపోతావ్ అంతటి శక్తిశాలి అయిన హనుమకే ఇలాంటి స్థితి వచ్చిందే మనకి రాదా .మరి ఆయన ఎలా బయట పడ్డాడు ఎంతటి విజయం సాధించాడూ .చూడరా అసలు అపజయం ఎక్కడుందీ జయమే ఆ ముసుగు వేసుకు వస్తుంది అని గ్రహించు ముందుకి నడు...

ఇలాంటి సంఘటనలు కొల్లలు చెపుతూ పోతే ఓ గ్రంధం కదూ .
ఇలాంటి పెన్నిధి మన దగ్గరుంది .తల్లి తండ్రులూ లేక తాత లేక స్నేహితులు ఇలాంటివి చూపిస్తే ఉత్సాహం తెచ్చుకుని కొండలు పిండి చేయరా
ఇది గొప్ప ప్రయోజనం కాదా ప్రవర్తన మార్చదా
ఆలోచించండి .రామాయణంలో ఇది చిన్న సంఘటన .ఇక రామాయణం ... మనిషి ప్రవర్తన కి ఉదాహరణ గా రాముడు నడిచి చూపించలేదా
ఒక సమస్య వస్తే ఇలాంటి పరిస్థితుల్లో రాముడేంచేశాడు సీతమ్మ ఏమనుకుంది హనుమ ఏం నిర్ణయం చేశాడు ఇవి మార్గ దర్శనం చేయటం లేదా .
రామాయణమే పూర్తిగా చెప్పలేదు ఇంక ధర్మసూక్ష్మ సమన్వయం మొదలు పెడితే ఇంకాచాలా .....అనంతం
డా.సూర్యనారాయణ వెన్నేటి

No comments:

Post a Comment