🧘♀️🧘🏻♂️*శ్వాస విజ్ఞానము:-*🧘♂️🧘♀️
శ్వాసతో పుట్టిన మనం, శ్వాస విడిచి వెళ్లిపోయేలోపు అసలా శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రము. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా -- మనం మనకు తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించుకొంటాము. ఉదాహరణకు, ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటవలసి వచ్చినప్పుడు కానీ అసంకల్పితంగానే మనం శ్వాసను బిగిస్తాము. కొన్ని సెకన్లు మాత్రమే జీవించే ప్రాణి నుండి బ్రహ్మం వరకు అందరూ శ్వాసిస్తారు. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తుంటుంది. సెకనుకు 18 కి.మీ.ల చొప్పున ఆకాశం వ్యాకోచిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.
🧘♂️ శ్వాస - సోహం:-
మనం శ్వాస తీసుకున్నప్పుడు 'సో' అనే శబ్దం, వదిలేటప్పుడు 'హం' అనే శబ్దం వచ్చును. 'సో'లో 'ఓ' అనే శబ్దం, 'హం'లో 'మ్' అన్న శబ్దం అంతర్లీనంగా ఉన్నది. ఈ రెండు కలిపి 'ఓం' అవుతుంది. ఓం అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి అనగా ఆదిపరాశక్తి. ఈ వివరణ మనకు తెలియక పోయినా, ఒక్కసారి మనము శ్వాస తీసుకుని వదిలినచో, ఆ ఆదిపరాశక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది అని ఋషుల వాక్కు.
శ్వాస ఎంత వరకు లోపలికి తీసుకుంటామో, అక్కడి నుండే మళ్ళీ వదలిపెడుతున్నాము. ఈ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యన ఉండు బిందువు 'శక్తి' యొక్క స్థానం అని తెలుసుకుని, ఆ బిందువు మధ్య ఖాళీ జాగాపై దృష్టి ఉంచగలిగితే అదే 'ప్రాణాయామము' అనబడుతుంది.
🧘♂️ శ్వాస - ఆయుష్షు:-
ప్రాణికోటికి భగవంతుడు ఆయుష్షును శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. నిమిషానికి ఎక్కువ శ్వాసలు ఖర్చుపెట్టినచో- తక్కువ ఆయుష్షు., మరి నిమిషానికి తక్కువ శ్వాసలు తీసుకున్నచో - ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు. సాధారణ మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. పరుగెత్తినపుడు, కోపంగా ఉన్నప్పుడు 18-24 సార్లు శ్వాసిస్తాడు. కామకేళి అనగా మైథున కాలంలో 35 సార్లు అంటే అన్నిటికన్నా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతాడు. మనిషి సరాసరిన రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు.
🌳 కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 20 సంవత్సరాలు జీవిస్తుంది.🌳 కుక్క నిమిషానికి 38 సార్లు శ్వాసించి 13 సంవత్సరాలు జీవిస్తుంది.
🌳 గుర్రం 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది.
🌳 తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 200 సంవత్సరాలు జీవిస్తుంది.
🧘♂️ శ్వాస - నాడులు:-
మన శరీరములో 272000 నాడులున్నాయి. నాడులనగా ప్రాణవాయువు (శ్వాస) యొక్క రాకపోకలకు మార్గములు, నరములు కావు. ఈ 272000 నాడులలో 10 నాడులు ప్రధానమైనవి. వీటిని దశ నాడులు అని పిలుస్తారు. అవి..
1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
4. గాంధారి నాడి - కుడి నేత్రం
5. అస్తిని నాడి - ఎడమ నేత్రం
6. పూష నాడి - కుడి చెవి
7. యశస్విని నాడి - ఎడమ చెవి
8. ఆలంబన నాడి - నోరు
9. లకుహా నాడి - శిశ్నము
10. శంభని నాడి - గుదము
మరణం సంభవించినప్పుడు పైన ఉదహరించిన 10 ద్వారాలలో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం బయటకు పోవును.
వీటిల్లో అత్యంత ప్రధానమైనది 3 నాడులు. అవి
1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారా ఎక్కువగా బయటకి ప్రవేశిస్తే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తే చంద్ర నాడి పనిచేస్తుందని తెలుసుకోవలెను. సుషుమ్న నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస బయటకు వస్తుంటుంది. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు శ్వాస మార్చుకుంటున్నప్పుడు కొన్ని సెకన్లు మాత్రమే సుషుమ్న నాడి యందు శ్వాస నడుస్తుంది. ఈ సమయంలో మనం ఏమి ఆశించిన అవి సిద్దించును.
సూర్యనాడి ఉష్ణ శక్తికి, చంద్రనాడి శీతల శక్తికి ప్రతీకలు. అందువలన శీతల వ్యాధులకు సూర్యనాడి, ఉష్ణ సంబంధిత వ్యాధులకు చంద్రనాడి ఉపయోగకరము. మరి సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఘన పదార్థాలు, చంద్రనాడి నడుస్తున్నప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవడం ఉత్తమం. కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది., అలాగే ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేక కుడి వైపు తిరిగి పడుకున్నా కొద్దిసేపట్లో ఎడమవైపుకు మారుతుంది.
స్త్రీ, పురుషులిద్దరూ ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసినా అసలు గర్భధారణ జరుగదు. పురుషుని యొక్క ఎడమ స్వరం, స్త్రీ యొక్క కుడి స్వరం పని చేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలుగుతుంది., అలాకాకుండా పురుషుని యొక్క కుడి స్వరం, స్త్రీ యొక్క ఎడమ స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుంది.
🧘♂️ శ్వాస - పంచప్రాణాలు:-
శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.
1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.
🧘♂️ శ్వాస - చక్రాలు:-
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
🌳 మూలాధార చక్రము నందు - 600 సార్లు
🌳 స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
🌳 మణిపూరక చక్రము నందు - 6000సార్లు
🌳 అనాహత చక్రము నందు - 6000 సార్లు
🌳 విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
🌳 ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
🌳 సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.
🧘♂️ శ్వాస - అంగుళాలు:-
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
🌳 శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
🌳 శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
🌳 శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.
🌳 శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
🌳 శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
🌳 శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి. 🌳 శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
🌳 శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.
మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.
🧘♂️ శ్వాస - సృష్టి వయస్సు:-
మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన 🌳కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
🌳 రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
🌳 మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
🌳 నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
🌳 పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.
🧘♂️ శ్వాస - సాధన:-
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.
*84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.
🧘♂️ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస 🧘♀️🧘♂️
No comments:
Post a Comment