*_జీవితంలో ఏదో ఒక చోట, ఏదో ఒకరోజు తీవ్ర అవమానాలు, అపజయాలు, కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలో అది సహజమే..._*
*_అంతమాత్రాన ఎవరికి జరగని అవమానం నాకే జరిగిందని, ఎవరికి రాని కష్టం నాకే వచ్చిందని కృంగిపోతే ఎలా.?_*
*_మాన, అవమానాలను సమభావంగా స్వీకరించినప్పుడే జీవితంలో నీవు నిలబడగలుగుతావు._*
*_ఏ ఒక్కరి జీవితం పూలబాటలా ఉండదు. ప్రతి మనిషి ముళ్ళబాటలను దాటాల్సిందే ... ముళ్లబాటను, పూలబాటగా మార్చుకునే శక్తి కూడా నీలోనే ఉంది... అంతమాత్రాన చతికలబడితే ఎలా..._*
*_కష్టించు, ప్రయత్నించు... ఏది తేరగరాదు, ఏది తేరగానే నీదరిచేరదు. అదృష్టాన్ని నమ్ముకోకు... అవకాశాన్ని అందిపుచ్చుకో... దృఢవిశ్వాసంతో ప్రయత్నించు. తప్పకుండా నీవు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటావు._*
*_చిన్న చిన్న సమస్య రాగానే... నాకే ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వస్తున్నాయని తెగ బాధ పడిపోకు, మదన పడిపోకు... బాధలో, ఆవేశంలో దిక్కు మాలిన నిర్ణయాలుతీసుకోకు..._*
*_కష్టాలొచ్చిందే... నీ యొక్క నైపుణ్యాన్ని, నీలో ఉన్న దృఢత్వాన్ని, నీలో ఆత్మవిశ్వాసాన్ని సాన పెట్టడానికే వచ్చిందని తెలుసుకో..._*
*_జీవితంలో కష్టాలు సుఖాలు సహజమే కానీ, కష్ట నష్టాలు మాన, అవమానాలు, బాధలుంటేనే కదా.! నీవెంటో ముందు నీకు తెలిసేది._*
*_సమస్యలను అతిగా భూతద్దంలో చూడకు... అవి చాలా పెద్ద సమస్యగా కనబడతాయి మనసులో భయం, ఆందోళన మొదలవుతాయి..._*
*_కాస్త దూరముతో చూడు అవి చిన్నగా కనబడతాయి. సమస్యను సవాలుగా స్వీకరించడం మొదలుపెడితే...ఆ సమస్యకు నీవే సమస్యగా మారిపోతావు 🥰 ప్రయత్నించు.?☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🦚🦚🦚 🍒🙇♂️🍒 🦚🦚🦚
No comments:
Post a Comment