🕉️ ఓం నమః శివాయ 🕉️
🙏 శివాయ గురవే నమః 🙏
స్త్రీలకు బహిష్టు రావడం ఎలా మొదలయ్యింది....!! నెలసరి నియమాలు పాటించక పోతే దోషమా......!!
పూర్వం ఒకానొక కారణం వలన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. ఆ కారణం గా ఇంద్రుడు ఒక్కసారిగా బలహీనుడు అయిపోయాడు; ఎవరిని చూసినా వణికి పోయే పరిస్థితి.
స్వర్గ లోకం పాలన అస్తవ్యస్తం గా తయారయింది. దేవతలు వెళ్లి బ్రహ్మ తో మొర పెట్టుకున్నారు. ఇంద్రుని బ్రహ్మ హత్యా దోషం తొలగడానికి బ్రహ్మ ఒక మార్గం కనుగొన్నాడు...
ఇంద్రునికి సంక్రమించిన బ్రహ్మ హత్యా దోషాన్ని 4 భాగాలుగా చేసి
ఒక భాగాన్ని భూమికి,
రెండవ భాగాన్ని వృక్షాలకు,
మూడవ భాగాన్ని సముద్రానికి,
నాల్గవ భాగాన్ని రజస్సు (బహిస్టు) రూపం లో స్త్రీలకు అందజేశాడు...
ఈ విధంగా స్వీకరించినందుకు ఈ నలుగురికీ వరాలు అనుగ్రహించాడు.... ఫలితం గా భూమిని ఎన్నిసార్లు తవ్వినా మళ్ళీ కప్పబడిపోతుంది;
బ్రహ్మ హత్యా దోషం లో భాగం పొందినందుకు వృక్షముల కాండాలనుండి బంక కారుతుంది. దోషాన్ని భరించినందుకు గాను చెట్ల శాఖలను నరికినా మరల మరల చిగురించే వరం ఇవి పొందాయి.
దోషం లో భాగం పొందినందుకు సముద్రం ఒడ్దు దగ్గర నురుగు ఏర్పడుతుంది; దోషాన్ని భరించినందుకు సముద్రం లో స్నానం చేసిన వారి పాపాలు హరించే శక్తి.... ముఖ్యంగా గ్రహణ సమయం లో... స్నానం ఆచరించిన వారి పాపాలు తొలగించే శక్తి సముద్రం పొందింది.
దోషం లో భాగం పొందినందుకు స్త్రీలకు నెలలో మూడు రోజుల పాటు బహిష్టు స్రావం వస్తుంది.. దోషాన్ని భరించినందుకు స్త్రీలకు మరో ప్రాణిని పుట్టించే హక్కుని ప్రసాదించాడు బ్రహ్మ.
బహిష్టు సమయం లో స్త్రీ శారీరక అశాంతికి లోనవుతుంది. బహిష్టు లో ఉన్న స్త్రీ తులసి చెట్టు ను తాక రాదు; తాకినా యెడల తులసి మాడిపోతుంది అని చెబుతారు. అలాగే బహిష్టు లో ఉన్న స్త్రీ దగ్గర పెట్టిన పచ్చని అరటి కాయ పసుపు రంగులో కి తొందరగా మారుతుందట. బహిష్టు స్త్రీ శరీరం నుండి నకారాత్మక శక్తి (నెగటివ్ ఎనర్జీ) వెలువడుతుందని చెబుతారు... ఆ కారణం గానే ఆమెకు ఆ మూడు రోజులు దేవుని గది లోకి వెళ్ళే అర్హత ఉండదు అని చెబుతారు.
సైన్స్ ప్రకారం చూసినా ఆ మూడు రోజులలో స్త్రీ నుండి వెలువడే స్రావం లో ప్రమాదకరమైన విష పదార్ధాలు, తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటాయి...
కాబట్టే ఆ పరిస్థితి లో ఉన్న స్త్రీ తీవ్రమైన శారీరక బలహీనత తో ఉంటుంది.. కాబట్టే స్త్రీలకు ఆ మూడు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతారు; ఎవరినీ ఆమె తాకరాదనీ, ఎవరూ ఆమెను తాకరాదనీ, వంట గది లోకి వెళ్ళకూడదనీ పెద్దలు నియమాలు విధించారు.... అయితే తెలిసో తెలియకో ఈ నియమాలు పాటించని స్త్రీ దోష పరిహారానికి ఒక వ్రతం ఆచరించాలి అన్నారు..
ఆ వ్రతం పేరే రుషి పంచమి వ్రతం... భాద్ర పద మాసం శుక్ల పక్షం లో వచ్చే వినాయక చవితి తరువాత వచ్చే పంచమి నాడు ఈ వ్రతం పాటించి దోషం నుండి నివృత్తి పొందవచ్చు అని మన సప్తర్షులు ఈ రుషిపంచమి వ్రత విధానం లో తెలియజేసారు.
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏
No comments:
Post a Comment