Saturday, October 12, 2024

 అరుణాచల👏
భగవాన్ రమణ మహర్షి,  చిక్కాల కృష్ణా రావు -- అరుణాచల శివా 
నిరాకారుడైన ఈశ్వరుణ్ణి ఒక విగ్రహంగా చేసి పూజించడం అవివేకం కాదా ?” అని ఒకరు అడిగారు. 
భగవాన్ :. విగ్రహారాధన చేయనివారెవరు? తెల్ల వారి లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేవరకు, ఎవరి విగ్రహానికి వారు పళ్ళు తోమడం, స్నానం చేయించడం, జుట్టు దువ్వడం, మూడుపూటలూ నై వేద్యం సమర్పించడం
మొదలైన ఆరాధన నుంచి తప్పించుకున్న వారెవరు? విగ్రహారాధన, వ్యక్తిగత దైవపూజ, శరణాగతి, ప్రేమ భావం, భక్తి, విశ్వాసం, తన్మయత్వం , ఆరాధన - ఇవన్నీ అన్ని కాలాల్లో, అన్ని జాతుల్లో అనాదిగా వున్న వే. కాని, నామ రూప 
రహితమైన పరమాత్మే అన్నింటిలోనూ అంతర్భూతంగా వున్న ఆత్మ అని అనుభవపూర్వకంగా గుర్తించడం అన్ని సంగతుల్లోకి గొప్ప సంగతి. అదే అసలు సంగతి. అదే అసలు సత్యం. అది అన్ని మతాల, సిదాంతాల, నిరూపణల్ని నిరాకరించక, 
మళ్లా వాటిని అధిగమించి వుంటుంది. అదే అద్వైత సిద్ధాంతం. అది ద్వంద్వ రహితం. దాన్నే ప్రాచీన ఋషులు ప్రబోధించారు, అది సూటైనది, సూక్ష్మమైనది, సులభమైనది.

No comments:

Post a Comment