కుండలిని సిద్ధ మహా యోగ పథంలో.....
చక్ర వ్యవస్థలోకి కుండలినీ శక్తి ప్రవేశిస్తే, ఆ మహాశక్తి ఆయా చక్రాలను ప్రేరేపిస్తుంది.....
📚🖊️ భట్టాచార్య
...శక్తిపాతం ద్వారా లేదా మరి ఏ ఇతర పద్ధతుల ద్వారా గాని... కుండలినీ శక్తి చైతన్యం చెందిన తరువాత , సాధకుడు, ప్రాణశక్తికి అనుసంధానం చేయబడతాడు. ఒకసారి కుండలినీ శక్తి, సాధకునిలో చైతన్యవంతం అయిందంటే, కుండలినీ శక్తి సాధకునికి
అప్పటినుండి గురువు. కుండలినీ సిద్ధ శక్తి సాధకునిలో జాగరణ చెందిన తరువాత, నీ జీవితంలో అనేకమైన విషయాలు జరుగుతాయి. ఆయా సమయాల్లో గమనిక, సాక్షీ భూతంగా ఉండాలి. సతత ధ్యానాభ్యాసాలు చెయ్యండి. నీ చుట్టూ విషయాలు రక రకాలుగా జరుగుతాయి. జరగనీయండి.....
....సాధకుని ఆధ్యాత్మిక పురోగతికి కావలసిన, ప్రాణాయామ - ఆసన లేదా రాజ యోగాభ్యాసాలు ....అసంకల్పితంగా, ఆ కుండలీనీ మహా మాయయే ఇస్తుంది. అనేకానేక క్రియలను కూడా ఆ శక్తి ఇస్తుంది. సాధకుడు ఈ క్రియలను కూడా సాక్షీ మాత్రంగా చూడాలి.
...కుండలినీ సిద్ధ మహా యోగ పథంలో, జనించిన ఈ మహా శక్తి...వెనుబాము చుట్టూ తిరుగుతుంది. అదంతా సాధకుడు అనుభవించవచ్చు. ఈ శక్తి, మెదడు లోని, వెనుబాము నందలి, సమస్త నాడులలో గల మల దోషాలను నిర్మూలించి, సమస్త నాడులనూ శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడిన నాడుల గుండా వైశ్విక శక్తి ( Cosmic Energy )...నిరాటంకంగా ప్రవహిస్తుంది.
...సుషుమ్నా నాడిలో అనేక సూక్ష్మ కవాటాలున్నాయి. కుండలినీ శక్తి తరువాతి చక్రానికి పయనించడానికి, ఆయా కవాటాలపై వత్తిడి ఇస్తుంది. ఒకవేళ కుండలినీ శక్తి తరువాత చక్రానికి వెళ్ళలేకపోతే, ఆ తత్సంబంధ చక్రానికి సంబంధించిన గుణాలు ప్రదర్శిస్తుంది.
...ప్రతి చక్రానికి, తత్సంబంధ శరీర భాగాలున్నాయి. చక్రం సూక్ష్మమైతే - శరీర భాగం (వినాళ గ్రంథి ) స్థూలం అవుతుంది. ఉదాహరణకు...మూలాధార చక్రం - విసర్జక వ్యవస్థ, స్వాధిష్ఠాన చక్రం - సంతానోత్పత్తి. ఆయా చక్రాలలో - ఆ చక్ర వ్యవస్థలో కుండలినీ శక్తి వ్యాపిస్తే, ఆ వ్యవస్థ అంతటికీ ప్రేరణను ఇస్తుంది. ఆయా చక్రాలలో కుండలినీ శక్తి ప్రవేశిస్తే, తత్సంబంధ అనుభవాలు, అనుభూతులు వస్తాయి. ఈ అనుభవాలు కర్మల బట్టి కూడా ఉంటాయి. అయితే ఈ అనుభూతులన్నీ ఆనందకరం.
No comments:
Post a Comment