శ్రీ గురుభ్యోన్నమః 18-10-24
1.నాలుక
2. కత్తి
3. కలము
4. డబ్బు
వీటిలో ఏదైనా సరే ఉపయోగించే వారిని నేర్పరితనమును బట్టి ఫలితం ఉంటుందండి.
1. నాలుక: మాటే మంత్రము మనసే బంధము. నాలుకను ఉపయోగించి ఋషులు వేదమంత్రాలు వచించారు. సద్గురువు తన అనన్య భక్తుడైన శిష్యునికి తన స్వరూపాన్నిస్తున్నది నాలుకతోనే.
2. కత్తి: దీనికి రెండు పక్కల పదును ఉంటుంది. కత్తిని చూసి వణికే వాడికి నిరుపయోగం. సద్వినియోగం చేసుకున్న వారికి విజయం అర్జునుడి వలె వీర స్వర్గం అలంకరించగలరు.
3. కత్తి కంటే కలం గొప్పది అంటాడు కవి. రాజు రాత్రి విగ్రహములందు జీవిస్తే సుఖవి ప్రజల నాలుకల పైన నాట్యం చేస్తారంటాడు జాషువా. కలం కూడా ఉపయోగించే వారిని బట్టి ఫలితాన్నిస్తుందని అర్థమైంది.
4. డబ్బు:అధిక సంపన్నుడైన డబ్బున్న రతన్ టాటాను సంపద ఇబ్బంది పెట్టలేదు. సంపదలేమి రమణ మహర్షినీ ఇబ్బంది పెట్టలేదు
సదా సద్గురు సేవలో...
సహజాచల రాజయోగి
No comments:
Post a Comment