Saturday, November 23, 2024

 నారద భక్తి సూత్రములు

37 వ సూత్రము  
"లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్"

భక్తుడు జనం మధ్యలోవున్న కూడా భగవద్గుణ శ్రవణ కీర్తనాది అభ్యాసం వలన భక్తి సుస్థిరం అవుతుంది. మానవుడై పుట్టినందుకు భగవత్భక్తి అలవర్చుకోవాలి,జన్మ సార్థక్యం చెందాలి.నామ జపం చేస్తూ సంసారం సంబంధమైన విషయవాంఛలు కలిగివుండి కూడా మనస్సు దైవ నామస్మరణ పై మనస్సు నిలపాలి.
భగవన్నామస్మరణ చేస్తే చాలు చండాలుడుకైన ,మానవ శ్రేష్ఠుడుకైన, యజ్ఞయాగాలు చేసిన జ్ఞాని యొక్క పుణ్యం తో సమానమైన పుణ్యం లభించి ముక్తి లభిస్తుంది.
అఖండ నామస్మరణే జీవిత లక్ష్యం గా సాధన సాగించాలి భక్తుడు.

38 వ సూత్రము 
"ముఖ్యతస్తు మహాత్కృపయైవ భగత్కృపా లేశాద్వ"

ముఖ్యం గా మహాపురుషుల (సద్గురువు) దృష్టి పడాలి,తర్వాత భగవత్ కటాక్షం కొంచెం ఉంటే చాలు,భగవత్భక్తి యోగం లభిస్తుంది.
అటువంటి మహాపురుషుల కృపాభాగ్యం కల్గుట చాలా దుర్లభం, వారి సాంగత్యంతో విషయం వాసనాజాలం పటాపంచలవుతుంది. వారి సాంగత్యంతో హరి గుణస్మరణ కీర్తనాదుల అభ్యాసం కల్గుతుంది. 
సద్గురువులు మానవమాత్రులు వలె కనిపించినప్పటికీ వారు సదాచార సంపన్నులు ,నిష్ఠాగరిష్ఠులు,భగవత్ సమానులు (లోక కల్యాణార్థం భగవంతుడు సద్గురువు గా అవతరిస్తాడు), వారు భగవతత్వం సంపూర్ణం గా తెలిసి అనన్య భక్తి రాసాబ్ధి లో తేలియాడే పరమ హంసలని గ్రహించాలి.సర్వ స్వర్గ సుఖాలు అన్ని కలిసినా కూడా వారి సత్సంగం యొక్క మహత్వం ముందు సరిరావు. అట్టి సత్సంగం  ఏ కొద్దిగా లభించినా అంతః కారణాన్ని పరిశుద్ధం చేసి కైవల్య మార్గానికి చెరువు చేస్తుంది.
హరి కరుణా కటాక్ష ప్రాప్తికి దోహదం కలగ చేసేది గురు అనుగ్రహణ మాత్రమే,గురు కటాక్షం కోసం బుద్ధిమంతుడైన భక్తుడు మహాత్ములను సేవిస్తాడు.మహామహుల కృపా తో ముక్తియే కాదు సంపూర్ణ భక్తి కూడా లభిస్తుంది. ఆ పరమాత్ముని అనుగ్రహణ ఎవరికీ కలుగుతుందో వారికే సద్గురువు యొక్క సత్సంగం లభిస్తుంది,సద్గురువు యొక్క సత్సంగం లభిచడం ద్వారానే భగవంతునిలో ఐక్యం కల్గుతుంది.

No comments:

Post a Comment