Saturday, November 23, 2024

 *సప్తమంగైయర్ స్ధలాలు.....*

సర్వాంగభూషితుడై పరమశివుడు ప్రసాదించే దర్శనాన్ని, ' సర్వేశ్వర దర్శనం' అంటారు.

శిరస్సు న గంగ, చంద్రమౌళి, నుదుటన త్రినేత్రం, కంఠాన నాగాభరణం, చేతను ఢమరుకం, త్రిశూలమును ధరించి, శివపాద దర్శనంతో  కూడిన దర్శనమే  ' సర్వేశ్వర దర్శనం' అంటారు.

ఈ అలంకారశోభితుడైన పరమేశ్వరుని దర్శించాలని అఖిలాండేశ్వరి అమ్మవారు వాంఛించింది. అమ్మవారి కోరిక తెలుసుకున్న సప్తమాతృకలు, తాము పూజించే  స్వయంభూ శైవక్షేత్రాలలో 
సర్వేశ్వరుని దర్శించ వచ్చని, అఖిలాండేశ్వరిని ఆ ఏడు స్ధలాలకి తీసుకుని వెళ్ళారు.  అఖిలాండేశ్వరి ఆ  సప్త క్షేత్రాల సర్వేశ్వరుని పూజించి తరించింది .

ఆ ఏడు స్ధలాలు...

1. హరి మంగై, 
2. చక్రమంగై,
3. నంది మంగై, 
4. శూలమంగై, 
5. తాళ మంగై, 
6. పశుమంగై, 
7. పుళ్ళమంగై,

ఈ స్ధలాలో వెలసిన ఈశ్వరుని...

1. హరి ముక్తీశ్వరుడు, 
2. చక్రవాగేశ్వరుడు, 
3. జంబుకేశ్వరుడు, 
4. కృత్తివాగేశ్వరుడు,
5. చంద్రమౌళీశ్వరుడు, 
6. పశుపతీశ్వరుడు, 
7. బ్రహ్మపురీశ్వరుడు...

అనే నామాలతో అర్చించి ఆరాధిస్తారు.

ఈ ఏడు   పుణ్యక్షేత్రాల
 పేర్లు  'మంగై' అనే  పేరు తో పూర్తి అవుతున్నందున, వీటిని
సప్త మంగైయర్ స్ధలాలుగా ప్రసిధ్ధి చెందాయి.

ఈ ఏడు శైవ క్షేత్రాలు తమిళనాడులో  కుంభకోణం- తంజై మార్గంలో వున్నాయి.

No comments:

Post a Comment