Saturday, November 9, 2024

****భిన్నమైన ఆలోచన కానీ అంతిమ లక్ష్యం ఒక్కటే...

 *`భిన్నమైన ఆలోచన కానీ అంతిమ లక్ష్యం ఒక్కటే...`*

*ఆడ లేదా మగ వారికి వారి వారి జీవితాల్లో శారీరకంగా సుఖం పొందాడానికి న్యాచురల్ గా ఒకరిని ప్రేమించి వారి ఇష్ట, అయిష్టలు కనుక్కొని దానికి తగ్గట్టు ఉంటూ ప్రేమగా మసులుతు సందర్బన్ని బట్టి నవ్విస్తూ, కష్టంలో తోడు ఉంట్టూ ఒక బలమైన బంధాన్ని ఏర్పారచుకుంటారు...*

*అది ఇరువురికి ఒకరి పై మరొకరికి అమితామైన ప్రేమ ఏర్పడి వారి ఇద్దరూ ఒక్కటవ్వడానికి దోహదం చేస్తుంది. వివాహం చేసుకున్న అనంతరం ఇది కొన్ని ఏళ్ళు జీవన వాహినిల కొనసాగుతుంది....*

*ప్రేమ వర్షంల కురుస్తుంది దాని తాకిడికి రెండు తనువులు ఏకం అవుతాయి. ఈ కలయికలో సంఘమిస్తారు, రమిస్తారు దాని ఫలితంగా వారి లక్షణాలు పోలిన నూతన తరం జన్మిస్తుంది....*

*అసలు కథ ఇక్కడే ఉద్భావిస్తుంది.పిల్లలను పెంచే భాద్యత లో భార్య నడవడికలు ఓర్పుగా పుట్టినింట్లో తల్లి వద్దా నేర్చుకొని వచ్చి అత్తరింట్లో వంశోద్దారకుడిని సున్నితంగా అత్త గారితో పెంచుతు కోడలిగా తన భాద్యతలు నిర్వర్తిస్తుంది...*

*కానీ మొదట్లో ఉన్న విధంగా ప్రేమ, ఆకర్షణ, ప్రేరణ గతంలో కన్నా ప్రస్తుతం ఉన్న భాద్యతల వల్లన సడలి పోతు క్రమంగా సన్నగిల్లి పోతాయి....*

*మరికొన్ని రోజులకే భార్యకు అర్ధం అవుతుంది భర్త మరొకరితో అక్రమ సంబంధం ఏర్పారచుకొని అక్కడ నూతన ప్రేమ అధ్యాయనాలు లిఖిస్తున్నాడు అని. భాద కలిగిన ఎవరికి చెప్పలేక గుండెల్లో పొంగి వస్తున్న భాదను ఆ నాలుగు గోడల మధ్య ఎవరితో చెప్పుకోలేక, చెప్పుకునే ఆధారమే బాధకు కారణం అని తానేలా చెప్పగలదు..??*
*భర్తగా తనకు తనపై సర్వ హక్కులు ఉన్నాయి కనుక ఏమన్నా బరిస్తుంది. చెయ్యి చేసుకున్న తన మీదే పడింది కదా అని సహిస్తుంది. కానీ తనకు మాత్రమే సొంతం అనుకున్నది పరాయి వాళ్లకు దక్కుతుంది అన్న భావన తట్టుకోలేదు కుమిలి పోతుంది ఆ అర్ధంగి...*
*ఇది ఒక భార్య దుఃఖం మోసం చేసే మగ వారి వల్లన వారి సతీమణులు పడుతున్న ఆవేదన......*

*`ఇప్పుడు రెండో కోణం......`*

*కట్టుకున్న భార్యకు అన్ని వసతులు ఉండేలాగా శ్రమించి తన సంపాదన తో తన జీవితంలోకి రాబోయే సతీమణి కి ఎటువంటి చిన్న ఇబ్బంది ఉండకూడదు అని ఇల్లు, బండి, ఇంట్లో కి అన్ని సామాన్లు ముందుగానే ఏర్పాటు చేసుకొని కొద్దిగా అకౌంట్ లో డబ్బులు, బంగారం కొనుక్కోని స్థిరపడిన అబ్బాయి తమ దగ్గర సంబంధికుల అమ్మాయి ని చేసుకొని తన జీవితం లో అనుకున్నది సాధించాను అని అనుకొనే భర్త....*

*కానీ పెళ్లికి పూర్వమే ఆ అమ్మాయి మరో వ్యక్తితో ప్రేమలో ఉండి తనతో చెట్టా పట్టాలు వేసుకొని వాగుల్లో, వంకల్లో ఎన్నో రాత్రులు ఇసుక తిన్నుల్లో చంద్రుడి వెన్నెల్లో ఆడి, పాడి తన ఇంట్లో ఈ వ్యవహారం తెలిసిన తల్లి, తండ్రి బిడ్డకు తాను చేస్తుంది చెడు పని ఇష్ట పడిన వాడు నిరుద్యోగి కనీసం వెనుక ఆస్తులు లేని బికారి అంటూ తన ప్రేమను వదులుకోవాలని లేదా కన్నా వాళ్ళ చావు చూస్తావని బెదిరించి పెళ్లి చేశారు....*

*ఇరువురి ఆలోచనలు, ఆశలు వేరు అయినా భర్త కోసం తన కోరికలను చంపుకుంది. ఇద్దరూ పిల్లనను కన్నింది కానీ ఎక్కువ కాలo పట్టలేదు ప్రియుడిని చేరుకోవడానికి మళ్ళీ గతాన్ని వార్తమానంలో కలిపేసుకుంది......*
*ఈ వ్యవహారం భర్త కి ఎవరో చెప్పే వరకు తనకు తెలియనే లేదు.అయినా సహించలేక కొట్టాడు మానుకో అన్నాడు వినలేదు భార్య తనకు ఒకే సమయంలో తనతో భార్య గా ఉండటం ఇష్టం అదే విధంగా ప్రియుడికి ప్రియురాలిగా ఉండటం ఇష్టమే....!!*

*అదెలా ఒకే సారి మనసులో ఇద్దరికి ఒకే స్థానం ఇవ్వడం సాధ్యం...??*
*ఇదే ప్రధాన సమస్య నేటి సమాజం లో గతం గత: అని వదలక పట్టుకొని ఇప్పుడు అదే వ్యవహారం నడిపిస్తే ఇప్పుడు తమ జీవితాల్లో ఉన్న వ్యక్తులకు దానితో సమస్య వస్తుంది కదా..!*

*అందుకే మనిషి లో ఉన్న ఆడ, మగ ఇరువురు నేటి సమాజం లో బంధాలను విచ్చిన్నం చెయ్యడానికి, భాదలను వారి జీవితాల్లో మరియు కుటుంబ సభ్యులల్లో తీసుకురావడానికి కారకులు అవుతున్నారు.....*

*వస్తావన్నీ గ్రహించని వారి వల్లనే ఇదంతా జరుగుతుంది. ధర్మంగా ఎవరు ఉంటున్నారు అందరూ చేస్తుందేగా అనుకోకుండా ఎవరు ఉన్న లేకున్నా నేను పద్ధతిగా, నీతిగా ఉంటాను అనుకోని ఉండే వారు ఎంత మంది ఉంటున్నారు..??*

*`ధర్మంగా ఉంటున్న వారికి సెల్యూట్....`*🙏🏻

*`లేని వారికీ అలా ఉండాలని అభ్యర్ధన..`*🙏🏻

`నోట్ :` *ఈ చిన్న కథ అందరిలో కొంత మార్పుకొరకు. ఎవరిని కించపరచడానికి లేదా దుషించిండానికి కాదు నచ్చితే షేర్ చెయ్యండి..*👍🏻

Sekarana

No comments:

Post a Comment