Thursday, November 7, 2024

 విశ్వాత్మ ఛానల్ పాఠకులకు 
.   శుభాభినందనలు 🙏
జూన్ 25-2024
చలాచల బోధ 
.            మనస్సు ఎప్పుడూ ఎదోఒక విషయం పట్ల ఆసక్తితో పనిచేస్తుంది.ఇష్టమైన పనులను చేస్తుంది.అయిష్టమైన పనులను చేయదు.ఇష్టమైనవి లభించినప్పుడు సంతోషిస్తుంది.ఆ యా వస్తువులపై,వ్యక్తులపై రాగం కలుగుతుంది.అయిష్టవస్తుప్రాప్తి వలన ద్వేషం, క్రోధం జనిస్తుంది.ఇష్టవస్తు ప్రాప్తి వలన 'ఇదినాది'అనే లోభం పుడుతుంది.ఈ విధముగా రాగద్వేషాలు మొదలగు ద్వందాలలో చిక్కుకుంటాడు.అలాగే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు కలుగుతాయి.ఇవన్నీ ఒక వ్యక్తిని నిరంతరము ప్రభావితం చేస్తూ ఉంటే తదనుగుణంగా ప్రవర్తిస్తూ కర్మలు చేస్తూ కర్మచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు.అతని బుద్ధి తనలో ముద్రించబడిన కర్మ వాసనలచే ప్రేరేపింపబడుతూ మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాడు.ఈ విధంగా క్రొత్త కర్మలు చేస్తూపోతాడు.క్రొత్త కర్మ వాసనలను ఆగామి అంటారు.పాత కర్మ అనుభవంలోకి వచ్చే దానిని ప్రారబ్దం అంటారు.అనేక జన్మల నుండి అనుభవంలోనికి రాని కర్మ వాసనలను సంచితము అంటారు.ఈ సంచిత కర్మ రాబోయే జన్మలలో వీలును బట్టి ప్రారబ్దంలో చేరుతూనే ఉంటుంది.
          ఈ విధంగా జన్మ కర్మ చక్రంలో చిక్కుకుంటాడు.సుఖమే కావాలి, దుఃఖం వద్దు అనే ఆలోచనతో కర్మలు చేస్తూపోతాడు.కాని తన వలన ఇతరులకు కలిగిన బాధలవలన,కర్మ ఫలితంగా తనకు కూడా బాధలు వస్తూ ఉంటాయి.ఆ బాధలను తప్పించుకొనే ప్రయత్నంలో విఫలమవుతూ ఉంటాడు.మరి దుఃఖ నివారణకు మార్గమేది?
         సశేషం........
                       ...............విజ్ఞాన స్వరూప్ 🌸

No comments:

Post a Comment