విశ్వాత్మ ఛానల్ పాఠకులకు
. శుభాభినందనలు 🙏
జూన్ 24-2024
. చలాచల బోధ ------
.
. ఆత్మ అనగా మానవునిలో "నేను నేను నేను"అంటూ నిరంతరము స్ఫురిస్తూఉండుట, మరణించిన తరువాత స్ఫురణ లేకుండుట.అనగా జీవించియున్న మానవునిలో "నేను నేనైన నేను"అనే జీవచైతన్యానుభవము.అది మనసు పనిచేయనప్పుడు మాత్రమే స్వానుభవముగా గుర్తింపబడుతుంది.కాని మనసు మెలకువలో,కలలో ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది.గాఢనిద్రలో ఏమీ తెలియని స్థితిలో ఉంటుంది గనుక ఆ"నేను నేనైన నేను"గుర్తింపబడదు.ఇది మనచేత గుర్తింపబడాలంటే (1)మెలకులో మనస్సును పని చేయకుండా ఆపీవేయగలుగుట (2) గాఢనిద్రలో మెలకువగా ఉండుట.కావున అది నిర్వికల్ప సమాధిలో గుర్తింప బడుతుంది.అట్టి సమాధి ధ్యాన సమయం లోనే కాకుండా మూడు అవస్థలలోనూ ఉండాలి.ఆ విధంగా ఉండటమును అమనస్కము అంటారు.
అయితే మనస్సును ఆపడం సాధ్యమేనా? జన్మించిన ప్రతి మానవునికి తన ఆయుష్కాలమంతా మూడు అవస్థలలోనూ,తన ప్రారబ్ద కర్మానుసారము పనిచేస్తూనే ఉంటుంది.మనస్సు ఎప్పుడూ ఎదోఒక విషయం మీద ఆలోచిస్తూనే ఉంటుంది.గతానుభవాలననుసరించి చింతిస్తూ, ప్రతిస్పందిస్తూ ఉంటుంది.లేక భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఆందోళన పడుతూ ఉంటుంది.కనీసం వర్తమానంలో ఉండటము కూడా ఆ మనస్సు వల్ల కాదు.కనుక ఈ మనస్సును నెమ్మదింపజేస్తూ చివరకు పని చేయకుండా ఆపీవేయ వలెను.దీనికి ఉపాయమేమి?
సశేషం! --------
. ------విజ్ఞాన స్వరూప్ 🌺
No comments:
Post a Comment