*🌷కర్మయోగం🌷*
*అధ్యాయం 3, శ్లోకం 42*
*ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।*
*మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।*
*ఇంద్రియాణి — ఇంద్రియములు;*
*పరాణి — ఉన్నతమైనవి;*
*ఆహుః — అనబడును;*
*ఇంద్రియేభ్యః — ఇంద్రియముల కంటే;*
*పరం — ఉన్నతమైనవి;*
*మనః — మనస్సు;*
*మనసః — మనస్సు కంటే;*
*తు — కానీ;*
*పరా — ఉన్నతమైనది;*
*బుద్దిః — బుద్ధి;*
*యః — ఏదైతే;*
*బుద్ధే — బుద్ధిని మించి;*
*పరతః — మరింత ఉన్నతమైనది;*
*తు — కానీ;*
*సః — అది (ఆత్మ).*
*🛸అనువాదం:*
*BG 3.42: స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.*
*🛸వ్యాఖ్యానం:*
*ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన పరికరముల వివిధ స్థాయిలను, శ్రీ కృష్ణుడు విశదీకరిస్తున్నాడు. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారయింది; దానికన్నా ఉన్నతమైనవి ఐదు జ్ఞానేంద్రియములు (రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దముల అనుభూతిని గ్రహించేవి); ఇంద్రియముల కన్నా మించినది మనస్సు; మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణా శక్తి కలిగిన బుద్ధి; కానీ ఈ బుద్ధి కన్నా మించినది దివ్య ఆత్మ.*
*ఈ అధ్యాయపు చిట్టచివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మనము కామాన్ని కూకటి వేళ్ళతో పీకివేయటానికి ఇక ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.*
🛸✨🛸 ✨🛸✨ 🛸✨🛸
No comments:
Post a Comment