🚩 గొప్ప లాజిక్ 🌹
విజయనగరం వెళ్ళే బస్సు కోసం రోడ్ మీద నిలబడ్డారు వాళ్ళిద్దరూ. చాలీచాలని పంచెకట్టులో మాసిన పై గుడ్డ తో అతడు; చిరిగిన పాత చీరలో ఆవిడ.
అంతలో బస్సు వచ్చింది. ఇద్దరూ ఎక్కేశారు . కండెక్టరు వచ్చి టికెట్ కోసం డబ్బులు అడిగితే .." బాబు.. విజయనగరం కు టిక్కెట్ ఎంత?" అంటూ అడిగాడు.
"అయిదు రూపాయలు. తొందరగా డబ్బులు తియ్"
అన్నాడు కండక్టర్. రొంటి లో ని
చిక్కం లోంచి డబ్బులు తీస్తూ
" మరి మా ఆడదాని కెంత?"అంటూ అడిగాడు.
బస్సులో జనం అందరూ గొల్లున నవ్వేరు. " నీకో రేటు మీ ఆడదానికో రేటు వుండదు.
పది రూపాయలు తియ్" అన్నాడు కండక్టర్ విసుగ్గా.
పది రూపాయలు తీసి కండెక్టర్
చేతిలో పెడుతూ , బస్సులోని జనం వంక తిరిగి " నవ్వకండి బాబులూ... నాకు తెలియక అడిగినాను.... ఎందుకంటే పొలంలో వ్యవసాయ పని కి వెళ్ళి ఇద్దరం సమానంగానే వరి నాట్లు వేస్తాం.. కానీ నాకు యాభై రూపాయలు ఇచ్చి మా ఆడదాని కి మాత్రం పాతిక రూపాయలే ఇస్తారు... ఇక్కడ కూడా అలాంటిది వుంటాదేమోని అడిగినా ను బాబూ.."
అన్నాడు అమాయకంగా.
No comments:
Post a Comment