🔔 *వ్యక్తిత్వం* 🔔
భక్తి, జ్ఞాన, కర్మ... మూడు మార్గాలలో ఏదో ఒకదాని ద్వారా పరమపదాన్ని చేరుకో వచ్చని చెబుతుంది భగవద్గీత. ఈ ఆధునిక యుగంలో జీవిక కోసం పరుగులు పెట్టాల్సిన క్రమంలో పూర్తి జ్ఞానాన్ని సాధించడం కానీ, భక్తిని నిలుపుకోవడం కానీ కష్ట సాధ్యం. కాబట్టి మిగిలిన కర్మమార్గంలో పయనించడమే శ్రేష్ఠం.
మనిషి కర్మలను ఆచరించకుండా కర్మబంధం నుంచి విముక్తుడు కాలేడు. భౌతి కంగా, మానసికంగా ఏదో ఒక పని చేయడమే కర్మ. తన ధర్మాన్ని సక్రమంగా నెర వేర్చడమే కర్తవ్యం. పరిస్థితుల ప్రాబల్యం ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తుంది. వర్తమా నంలో ఉంటూనే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమి చేయాలో ఏమి చేయ కూడదో తెలుసుకోవాలి. ఉత్తమమైన, ఉపకార కర్మలనే ఆచరించాలి.
దైనందిన జీవితంలో ప్రతి పనినీ పూర్తిగా ఆస్వాదిస్తూ చేయాలి. దీనినే వివేకా నందుడు ఎరుకతో కూడిన కార్యాచరణ అన్నారు. నిస్వార్థమైన, ఫలితం ఆశించని చర్యలే నిజమైన కర్మలు. ఇవి మన సును ప్రక్షాళన చేస్తాయి. చేసే ప్రతి పనినీ భగవంతుడికి అర్పించడమే కర్మ యోగం. నిజానికి బతుకు పోరాటంలో తీరిక లేని సామాన్యులు నిత్యం పూజలు స్తోత్రాలు వంటివి చేయలేరు. అటువంటప్పుడు స్నాన పానాదులనే భగవదర్పితం చేస్తే వాటినే ఆయన అభిషేక, నైవేద్యాలుగా స్వీకరిస్తాడు.
తపస్సులూ యజ్ఞ యాగాదులూ... పూర్వయుగ ధర్మాలు. కాలమాన పరిస్థి తులకు అనుగుణంగా స్వధర్మాన్ని అను సరించడమే ఇప్పటికి తగినది. మనిషి తన కర్మను ధర్మమార్గంలో చేయడం మోక్షకారకం.
దానధర్మాలు చేస్తూ పెద్దవారిని గౌరవిం చడం, కుటుంబం పట్ల బాధ్యతతో వ్యవహ రించడం, భూతదయ కలిగి ఉండటం వంటివి సత్కర్మల కిందికే వస్తాయి. అబద్ధ మాడటం, మోసం చేయడం, కపట బుద్ధి కలిగి ఉండటం, హింసాత్మక ప్రవృత్తి వంటివి దుష్కర్మల హేతువులు. ఇవి మనిషి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా సామాజిక జీవనాన్ని కూడా కలుషితం చేస్తాయి. వీటిని వదిలివేయడమే ఉత్తమ జీవన గతి.
స్వామి వివేకానంద కర్మయోగాన్ని మానసిక క్రమశిక్షణగా అభివర్ణించారు. ఇది వ్యక్తిని బాధ్యతాయుతంగాను, సమాజానికి ఉపయోగపడే విధంగాను తీర్చిదిద్దు తుందని అంటారాయన. ఈ ప్రయాణంలో నాలుగు సూత్రాలను గుర్తు పెట్టుకో వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. అహాన్ని తగ్గించుకుని హృదయ వైశాల్యాన్ని పెంచుకోవాలి. బంధాలను గౌరవిస్తూనే అవి నిత్యమూ, శాశ్వ తమూ కావని గుర్తెరగాలి. నిష్కామ కర్మల వలన దుఃఖాలు బాధించవు. కర్మయో గులు ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడగలరు. భౌతిక బంధాల నుంచి సునా యాసంగా విముఖులవుతారు. ఈ సమతౌల్య స్థితి కర్మపథాన్ని ఫలవంతం చేస్తూ క్రమంగా భక్తి, జ్ఞాన మార్గాలకు కరదీపిక అవుతుంది.
No comments:
Post a Comment