Monday, December 16, 2024

 *భగవత్ వినాయకుడు...!!*

🌸చోళమండలంలో ఆలయాల నగరంగా ప్రసిధ్ధికెక్కిన కుంభకోణంలోని, కావేరీతీరం నుండి సుమారు 200 మీ. దూరంలో మఠం వీధిలో తూర్పు ముఖంగా శ్రీ భగవత్ వినాయకుని ఆలయం వున్నది. భక్తి శ్రధ్ధలతో సేవించిన వారికి సకల సంపదలు అనుగ్రహించే కరుణామూర్తి భగవత్ వినాయకునికుడు. 

🌿ప్రమధగణాధిపతియైన వినాయకుడు ఎనిమిది కోట్ల అవతారాలు దాల్చినట్లు చెప్తారు. ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా ఈ భగవత్ వినాయకుని  ఆలయాన్ని కీర్తిస్తారు. 

🌸ప్రాచీన కాలంలో కావేరీ నది ఈ మఠం వీధిలోనే ప్రవహించేదట. పిదప అఖండ కావేరి తన వెడల్పు తగ్గించుకొని కొంచెం దూరంగా జరిగిందని చెప్తారు. ఈనాడు ఆలయం విడిగాను, భగవత్ మెట్ల ఒడ్డు విడిగాను వున్నాయి. 

🌿 అస్థికలు పుష్పాలుగా మారిన వైనం..

🌸వేదారణ్యానికి చెందిన శ్రీ భగవర్  మహర్షి తల్లి మరణానికి ముందు "నేను మరణించాక, నా అస్ధికలను ఒక్కొక్క తీర్ధానికి తీసుకువెళ్ళు. ఏ తీర్ధంలో అస్ధికలు పుష్పాలుగా మారుతాయో ఆ తీర్ధంలో అస్ధికలు కలుపు" అని చివరి కోరికగా తెలిపి మరణించినది. 

🌿భగవర్ మహర్షి మాతృమూర్తి ఆనతి ప్రకారం అస్ధికలను కుండలో పెట్టుకుని అన్ని తీర్ధాలు సేవిస్తూ వచ్చాడు. కుంభకోణానికి రాగానే భగవర్ శిష్యుడు గురువు గారికి తెలియకుండా అస్ధికల కుండ తెరిచి చూసాడు, మహదాశ్చర్యం! కుండలో అస్ధికలు  పువ్వులుగా మారి వుండడం గమనించి పులకించిపోయాడు.

🌸కానీ కుండ ఎందుకు తెరిచి చూశావని గురువుగారు మందలిస్తారన్న భయంతో విషయాన్ని గురువుకి తెలుపలేదు. భగవర్ కాశీకి వెళ్ళి కుండ తెరిచి చూడగా అందులో అస్ధికలే వున్నాయి. అది చూసిన శిష్యుడు విస్తుపోయాడు. కుంభకోణంలో తను చూసిన విచిత్రాన్ని మహర్షి కి చెప్పాడు. 

🌿అది విన్న భగవర్ మహర్షి తిరిగి కుంభకోణానికి వెళ్ళాడు. కావేరీ తీరాన
వున్న వినాయకుని ముందు అస్ధికలను పెట్టి భక్తి శ్రధ్ధలతో ప్రార్ధించాడు. అస్ధికల కుండ తెరచి చూడగా కుండ నిండా పువ్వులు వున్నాయి. 

🌸అందువలన "కాశీ కన్నా వీసమెత్తు  వీసం వున్న క్షేత్రంగా" గ్రహించి భక్తితో అతిశయింగా ఆరాధించి పూజించాడు.  అస్తికలను తీసుకుని కావేరీలో స్నానం చేసి, చేయవలసిన కార్యాలు ముగించాడు. అస్ధికలు పువ్వులు గా మారిన తీర్ధ తీరమే భగవత్ మెట్ల తీర్ధంగా, భగవర్ మహర్షి  పూజించిన వినాయకుడు భగవర్ వినాయకుడు గా ప్రసిధ్ధిపొందింది.

🌿 దంత సమర్పణ..

🌸కాంచి పెరియవర్ కుంభకోణం  వచ్చినప్పుడల్లా ఈ వినాయకుని దర్శించి వెడతారు. 1952వ సంవత్సరం లో కంచి శంకరమఠానికి చెందిన చంద్రమౌళీశ్వరుడు అనే  ఏనుగు తిరువీశ నల్లూరులో వున్నది. 

🌿ఆ సమయంలో కంచి పెరియవర్, ఆ ఏనుగు రెండు దంతాలను  శ్రీ భగవత్ వినాయకునికి సమర్పించి పూజించారు. సంకట చతుర్ధి, వినాయక చతుర్ధి ఉత్సవాలలో భగవత్ వినాయకుని ఆ దంతాలతో అలంకరించి పూజించడం ఆచారం.

🌸 వినాయకుని దేహములో నవగ్రహాలు..

🌿విగ్రహమూర్తిగా కూడా విశిష్టత కలిగిన వినాయకుడు. నుదుట సూర్యుడు, నాభిప్రదేశాన చంద్రుడు, కుడి తొడ కుజుడు, కుడి క్రింద చేతిలో బుధుడు, శిరస్సున గురువు, ఎడమ క్రింద చేతిలో శుక్రుడు, కుడి ప్రక్కన పై చేతిలో శని, ఎడమ ప్రక్కన పై చేతిలో రాహువు, ఎడమ తొడలో కేతువుని యిలా నవగ్రహాలను తన రూపంలో ధరించి కొలువై వున్నాడు.

🌸అందువలన యీ స్వామిని ఒక్కసారి దర్శిస్తేనే చాలు గ్రహదోషాలు తొలగిపోతాయి. ఆనందం లభిస్తుంది అని ఐహీకం.

🌿 అన్నాజీ రావు నిర్మించిన ఆలయం..

🌸శరభోజి మహారాజు కాలంలో కోనప్పడుకై తొండమానుడు అనే రాజుకు అన్నాజీరావు ప్రధానమంత్రి గా వుండేవాడు. భగవత్ వినాయకుని దర్శించిన తరువాత ఆయన కష్టాలు కష్టాలు తీరడంతో అన్నాజీరావు వినాయకునికి ఆలయాన్ని నిర్మించాడు.


🌿వినాయక చవితి ఉత్సవాలు పది రోజులపాటు ఘన వైభవంగా జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో దర్శనం ప్రసాదిస్తాడు గణేశుడు. సంకటహర చతుర్ధి నాడు వినాయకునికి అర్చనాభిషేకాలు చేసి పూజిస్తే  ఎలాటి సమస్యలైనా తొలగి
కష్టాలు గట్టెక్కుతాయి. 

🌸ఇక్కడ గణపతి హోమం చేసి ఏ నూతన కార్యం ప్రారంభించినా
విజయం తధ్యం.సకల సౌభాగ్యలు సిధ్ధిస్తాయి..        

No comments:

Post a Comment