Monday, December 16, 2024

 🙏 *రమణోదయం* 🙏

*బలమైన ఆశాపాశాలను చటుక్కున త్రుంచి పారవేసి, తీవ్రమైన భక్తితో మనస్సుని ఈశ్వరుని పాదాలపై లగ్నం చేసి, క్షణం వృధా కాకుండా ధ్యానించు.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.515)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*

 కర్మను భగవదర్పితం చెయ్యడంవల్ల చిత్తశుద్ధి
కలుగుతుంది.. అయితే కర్మ చేసినప్పుడు మాత్రమే
భగవంతుని స్మరిస్తే చాలదు..భగవంతుని స్మరణ
నిర్విరామంగా, సంతత ప్రవాహంగా కొనసాగాలి.
అప్పుడే చిత్తం విశుద్ధమవుతుంది!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

"నేను" వైపుకు తప్ప మిగతా అన్నివైపులకూ
తిరుగుతుంది మనసు.
దానికి బాగా తెలుసు
"నేను" వైపుకు తిరిగితే
తన ఉనికినే కోల్పోతానని!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

No comments:

Post a Comment