Monday, December 16, 2024

 *సత్సంగం* 🚩

*భక్తుడికి - భగవంతుని పై ఎలాంటి విశ్వాసం వుండాలి???*
*మన దృష్టి ఎట్టిదో సృష్టి అలాంటిది.*
*మనం చూసే విధానం...పట్టి భగవంతుని అనుగ్రహము కూడా వుంటుంది.*🙏🙏🙏

ఒక చిన్న సంఘటన ద్వారా పరిశీలిద్దాం!!!...

ఒక భారతీయుడు, ఒక ఆంగ్లేయుడు, ఇరువురూ గోదావరి నదిలో మునిగి స్నానం చేశారు.


*భారతీయుడు, తాను శారీరకంగానూ, మానసికంగానూ, పరిశుధ్ధుడనయ్యానని  ఆ అవకాశం లభించడం తన అదృష్ట మని ఎంతో ఆనందించాడు.*

అది చూసి ఆంగ్లేయుడు, ఓరి పిచ్చోడా అని నవ్వి ... 

*" ఇది కేవలం రెండు పాళ్ళు హైడ్రోజన్, ఒక పాలు ఆక్సిజన్ ల కలయిక, దీనిలో మునిగితే, నీకు చెప్పలేని ఆనందం ఎలా కలుగుతుంది"?*  అన్నాడు.

సందేహించిన ఆంగ్లేయునికి బాహ్య శుభ్రత మాత్రమే కలిగింది.

నమ్మిన భారతీయునికి ఆంతరంగిక శుభ్రత కూడా కలిగింది...

*ఎలా!!*
*అంతఃశుధ్ధికి  కావలసినది భక్తి, విశ్వాసము అని తెలుసుకోవాలి, దైవం అనే విశ్వాసము హృదయానికి, సంబంధించినది.*

*అది మానవతా విలువల రూపంలో ... అంటే శాంతి, ప్రేమ, ధర్మ , సత్యం రూపంలోనూ వ్యక్త మౌతుంది.*

అవిశ్వాసము, లోభము మత్సరము , కామము, క్రోధము  ఇవి శిరస్సు కు సంబంధించినవి.

ఈ అరిషడ్వర్గాలున్న  మనిషి  ముఖం కూడా ప్రశాంతంగా కనపడదు.

దైవం ఉంది అన్న వానికి  ఉంది...
లేదు అన్న వానికి లేదు.
నమ్మిన వాడికి సొమ్ము - నమ్మని వాడికి దుమ్ము.

*కానీ వారిని చూసి మనం మోస పోవద్దు, అప్పుడే భగవంతుడి అనుగ్రహానికి పాత్రులమవుతాము.*
             
  🕉️ *సర్వేజనా సుఖినోభవంతు* 🕉️

No comments:

Post a Comment