*"ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం"*
*సరైన తిండితోనే శరీరంలోని జీవక్రియలన్నీ సజావుగా జరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆధారమైన ఇలాంటి అంశాల చుట్టూనే ప్రకృతి చికిత్సలు ఉంటాయి.*
*"నీళ్లు"*
*రక్తప్రసరణలో భాగంగా మన శరీర జీవక్రియల ద్వారా తయారైన వ్యర్థాలు, హానికర పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఇందుకోసం తగినన్ని నీళ్లు అవసరం. నీటివల్ల శరీర ఉష్ణోగ్రత తగినట్టుగా ఉంటుంది. మల, మూత్ర విసర్జనలు సాఫీగా సాగుతాయి.*
*"ఆహారం"*
*ప్రకృతి వైద్యం ప్రకారం ఆహారమే ప్రధాన ఔషధం. రోజుకు రెండుసార్లు తినేవాళ్లను మితాహారులంటారు. ఆ ఆహారం నాణ్యంగా ఉండటమూ ముఖ్యమే. ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. కడుపులో మూడు భాగాలు నాణ్యమైన ఆహారంతో, నీటితో నింపాలి. నాలుగో భాగం ఖాళీగా ఉంచాలి.*
*"ఉపవాసం"*
*ఉపవాసం ద్వారా జీర్ణవ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. ఉపవాసం మనసులోని మాలిన్యాలను కూడా తొలగిస్తుంది. ఆ సమయంలో చిత్తం ప్రశాంతంగా ఉంటుంది.*
*"వ్యాయామం"*
*వ్యాయామం రోజువారీ జీవితంలో భాగం కావాలి. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అన్నీ కలిపితేనే సంపూర్ణ యోగా అవుతుంది. దీనివల్ల కీళ్లన్నీ ఫ్లెక్సిబుల్ అవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.*
*"ప్రార్థన*
*ప్రార్థన కూడా ప్రకృతి వైద్య సూత్రమే. మనసును స్వచ్ఛం చేస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే శారీరక వ్యాధులు దూరమవుతాయి. హార్మోన్లు సమతుల్యమవుతాయి.*
💠💠
No comments:
Post a Comment