*_కొంతమందికి ప్రేమను చూపించడం చాలా కష్టం... కొంతమందిని అర్ధం చేసుకోవడం ఇంకా కష్టం._*
*_కొందరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కోపంతో ఊగిపోతారు... మరికొన్నిసార్లు బాధలో మునిగిపోతారు... ఇంకొన్నిసార్లు మౌనంగా మిగిలిపోతారు..._*
*_చాలాసార్లు గందరగోళంలో తేలిపోతారు... ఎప్పుడు మనసు ఎలా మారిపోతుందో తెలియని పరిస్థితులలో బ్రతుకుతూ ఉంటారు._*
*_ఇలాంటి సందర్భాలలో మనతో ఉన్నవాళ్ళు ఈమె/ఇతను ఏంటి ఇలా ఉన్నారు... ఇలాంటి వారితో బంధం అవసరమా అనే అభిప్రాయానికి వచ్చి ఆ బంధానికి వీడ్కోలు చెప్పడానికి క్షణం కూడా ఆలోచించరు..._*
*_కానీ, ఇలాంటి పరిస్థితిలో కూడా మనల్ని అర్ధం చేసుకొని మన ప్రవర్తనకు తగినట్లుగా నడుచు కుంటూ... మనల్ని ప్రేమించాలని, మన మనోభావాలని గౌరవించాలి అనుకుంటారో..._*
*_వారే మనకు నిజమైన ఆత్మబంధువులు అలాంటి వారు దొరికినప్పుడు అసలు వదులుకోకండి.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌷🌷🌷 🌹🙇♂️🌹 🌷🌷🌷
No comments:
Post a Comment