*నవగ్రహాలు అనుకూలించాలి అంటే ఏమి చేయాలి..?*
🌸నవగ్రహాలు అనుకూలించాలి అంటే పరిహార ప్రక్రియలు చేసుకోలేని వారికి ఈ విధంగా చేస్తే కొంత వరకు గ్రహాలు అనుకూలంగా అవుతాయి.
🌿రవిచంద్రులు అనుకూలించాలి అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తల్లిదండ్రులును బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి.
🌸గురుబలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి., లేదా రోజు పసుపును పాలతో కలిపి నుదుటన బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి.
🌿శుక్రగ్రహం అనుకూలించాలి అంటే ఇంటి ఆడ పిల్లలను గౌరవించాలి. ఆదరించాలి అలా చేస్తే శుక్ర గ్రహము అనుగ్రహం ఇస్తుంది. ఒకవేళ ఇంటిలో ఆడపిల్లలు లేకుంటే మేనత్తను గౌరవించాలి.
🌸అత్త కూడా లేకుంటే కన్నతల్లిని గౌరవించాలి. కన్నతల్లికి శుక్రవారం రోజు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేసుకోవాలి.
🌿కుజుడు అనుగ్రహం కొరకు సోదర వర్గాన్ని ఆదరించాలి. సోదరిని బాగా చూసుకోవాలి. కార్తీకమాసం వచ్చిన భగినీహస్తభోజనం శుద్ధ విదియ నాడు వస్తుంది. ఆడపిల్ల ఇంటికి వెళ్ళి భోజనం చేసి బట్టలు పెట్టి రావాలి.
🌸శనిగ్రహం అనుకూలించాలి అంటే ఇంట్లో పని మనుషులను చికాకు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనివారి కి తగినంత జీతం ఇవ్వాలి. ఇంట్లో పని వారు లేకుంటే బీద సాదలను వికలాంగులను ఆదరించాలి.
🌿బుధుడు అనుగ్రహించాలంటే మేనమామను ఆదరించాలి. యోగక్షేమములు చూసుకోవాలి. లగ్నకుండలి ఆధారంగా కొందరు జాతకులు అన్నదానం చేయరాదు.
🌸ఒకవేళ అన్నదానం చేసినట్లయితే అన్నం తిన్న వారు తిరిగి యజమానికి ద్రోహం చేస్తారు.ఇటువంటి సంఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తాము. బంధువులు వీరి ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి వీళ్లని మోసం చేయడం గమనిస్తూ ఉంటాం.
🌿వెంట తిరుగుతూ వీరి వెంట ఉంటూ వీరినే మోసం చేయడం చూస్తుంటాం.శని భగవానుని యొక్క స్థితిని బట్టి ఈ విధమైన సంఘటనలు జరుగుతాయి.
🌸రవి యొక్క స్థితిని అనుసరించి కొందరు ఎవరి నుంచి ఏ వస్తువు ఉచితంగా తీసుకోకూడదు. చంద్రుడు యొక్క స్థితిని ఆధారంగా కొందరు పాలు, నీరు ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. మాంసాహారం తినరాదు.
🌿కుజుడు యొక్క స్థితిని ఆధారంగా కొందరు చక్కెర వ్యాపారం చేయరాదు మరియు వికలాంగులకు దూరంగా ఉండాలి.
🌸బుధుడు యొక్క స్థితిని ఆధారంగా మాంసాహారం గుడ్లు చేపలు తినరాదు. ఆకుపచ్చ దుస్తులు ధరించరాదు.
🌿గురువు యొక్క స్థానాన్ని ఆధారంగా కొందరు సాధువులకు సన్యాసులకు సహాయం చేయరాదు. వస్త్రాలను దానంగా ఇవ్వరాదు.
🌸శుక్రగ్రహం యొక్క స్థితిని ఆధారంగా కొందరు ఎక్కువ శబ్దంతో సంగీతం వినరాదు. అదే విధంగా నృత్యం చేయరాదు.
🌿శనిభగవానుని స్థితి ఆధారంగా కొందరు గంగా భాగీరధులకు దూరంగా ఉండాలి.పర స్ర్తి సాంగత్యం చేయరాదు.
🌸రాహువుయొక్క స్థితిని ఆధారంగా కొందరు బ్లూ కలర్ బ్లాక్ కలర్ బట్టలు వేసుకో రాదు. కుక్కను పెంచరాదు.
🌿కేతువు యొక్క స్థితి ఆధారంగా కొందరు తప్పుడు వాగ్దానాలు చేయరాదు. సంతానం లేని వారి నుండి భూమిని కొనరాదు..స్వస్తి..
No comments:
Post a Comment