*_ఎప్పుడైతే మనకు సహాయం చేసిన వారిని మనం పతనం చేయాలనుకుంటామో..._*
*_అప్పుడే మనకు అస్సలైన పతనం మనకు ప్రారంభం అవుతుంది అని గుర్తుంచుకోవాలి._*
*_మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు, అలా ఉంటారు అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే..._*
*_మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం తప్ప మరొకటి లేదు._*
*_మీరు అందరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మనిషి అవసరం ఉంటే నాకు అంతా నువ్వే అంటారు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు..._*
*_ఇది నేటి మానవ నైజం మనమెంత గొప్పవారం అయిన మనం ఎంచుకునే స్నేహితుల బట్టే మన ఎదుగుదల, పతనం ఆధారబడి ఉంటాయి జాగ్రత్త సుమీ..._*
*_కర్ణుడంతటి వానికే చెడు స్నేహం వల్ల పతనం తప్పలేదు మనమెంత.? మనిషిని చూడకండి, మనసును చూడండి... పేద ధనిక అనే బేధం భావం లేకుండా అతని వ్యక్తిత్వాన్ని గమనించండి._*
*_మనిషికి అవసరం గొప్పది. అది ఆర్థిక సంబంధమా, మాట సహాయమా... మరేదేమైనా సంబంధమా... అనేది కావొచ్చు. మనం స్వతహ విశ్లేషించి తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది._*
*_నేటి ఈ కలియుగంలో... డబ్బుకు లోకం దాసోహం అనే కవి పలుకులు అక్షరాల నిజం. కలిసున్న బంధాన్ని తెంపు తుంది. అనుకుంటే తగాదాలను సృష్టిస్తుంది. ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం మనిషికి గొప్పది._*
*_మనిషి ఉన్నప్పుడు మనం పట్టించుకోం... కానీ... పోయాక మాత్రం వారి పోటోలపై ప్రేమ కురిపిస్తాం..._*
*_పొటో మాట్లాడదు అని తెలిసినా మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడుతూ... మన కర్తవ్యంగా తినిపించకుండా..._*
*_పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమన్నాం పెడతాం శవం లేచి తినదు అని తెలిసినా మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా.?_*
*_ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుందాం... పోయాక పిండ ప్రధానం చేస్తూ.. పిండం పెడితే లాభమేముంది.? ఉన్నప్పుడే మన యొక్క ఆత్మీయుల యొక్క విలువలు తెలుసుకొని మసులుకోండి._*
*_డబ్బులు సంపాదించండి తప్పులేదు అది మన అవసరం కూడా కానీ డబ్బే లోకంగా బ్రతకకండి.☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🦚🙇♂️🦚 🌹🌹🌹
No comments:
Post a Comment