🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కాశీలో 9 రోజులు…*
*నిద్ర చేయాలంటారెందుకు?*
➖➖➖✍️
```
తల్లిగర్భంలో మనిషి ఉండేది నవమాసాలు.
కాశీ ఒక్కటే జన్మరాహిత్యాన్నివ్వగల పుణ్యక్షేత్రం. కనుకనే వ్యాస మహర్షి కాశీలో తొమ్మిదినెలలు దీక్షలో ఉండి,
ఆ తర్వాతే స్వస్థలాలకు వెళ్లాలని చెప్పాడు.
కనీసం తొమ్మిది రోజులైనా కాశీలో ఉండి వెళ్లాలని సూచించాడు.
ఆ 9 రోజుల్లో ఏం చెయ్యాలి?
విశ్వేశ్వర నామస్మరణ, దానాలు చేయటం, ధర్మ ప్రసంగాలు వినటం, ఏక భుక్తం, ప్రాతఃకాల స్నానం, ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం, కోపం లేకుండా ఉండటం, అబద్ధాలు మాట్లాడకుండటం అనే ఎనిమిది అంశాలను ఖచ్చితంగా దీక్షలాగా అమలు చేయాలి.```
*🪷1. తొలిరోజు కార్యక్రమం:~*```
“33 కోట్ల దేవతలూ తీర్ధాలతో సర్వపరివారంతో సేవింప బడుతున్న శ్రీకాశీ విశ్వేశ్వరా! శరణు! అనుజ్ఞ!” అని మనస్సులో స్మరించుకొని మణి కర్ణికా తీర్థానికి వెళ్ళాలి. చక్రతీర్ధం అంటారు దీనినే. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే మహాదేవుని సేవలో ఇక్కడే తరించాడు. తత్ ఫలితంగా ఏర్పడిన మణికర్ణికకు విశిష్టత చేకూరింది. మణికర్ణికలో స్నానాలాచరించి బ్రాహ్మణులకు దానాలు చేయాలి. అక్కడి నుండి ‘డుండి వినాయకుణ్ణి’ దర్శించి 21 గరికలను, 21 కుడుములను సమర్పించి 21 సార్లు గుంజీలు తీసి 21 రూపాయలు దక్షిణగా సమర్పించి అన్నపూర్ణాదేవినీ, విశాలాక్షి,జ్ఞానవాపి,సాక్షి గణపతులను దర్శించుకుని నివాసాలకు చేరుకుని భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాథుని దర్శించాలి. పండ్లు, పాలు ఆహారంగా తీసుకోవాలి.```
*🪷2. రెండవ రోజు కార్యక్రమం:~*```
గంగాస్నానంచేసి విశ్వేశ్వర, అన్నపూర్ణా దర్శనం చేసుకోవాలి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణికా ఘట్టంలో స్నానంచేసి, తీర్ధశ్రాద్ధం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రమూ కూడా విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి. రాత్రి ఫలహారంచేసి పడుకోవాలి.```
*🪷3. మూడవ రోజు కార్యక్రమం:~*```
తెల్లవారక ముందే ‘అసీ ఘాట్’ లో సంకల్పస్నానం చేసి అక్కడున్న సంగమేశ్వరస్వామిని దర్శించాలి. తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి ‘రుద్ర సరోవర తీర్ధం’ అనే పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానంచేసి శీతలా దేవిని దర్శించాలి. ‘వరుణా ఘాట్’ కు వెళ్లి స్నానంచేసి ఆదికేశవస్వామిని దర్శించాలి. పంచనదీ తీర్ధమైన బిందు మాధవఘట్టంలో సంకల్ప స్నానంచేయాలి. బిందుమాధవ సంగమేశ్వరదర్శనం చేసుకోవాలి. మణికర్ణేశుని, సిద్ధివినా యకుని దర్శించి పూజించి, అన్నపూర్ణా విశ్వేశ్వరదర్శనం గావించి నివాస స్థలం చేరి భోజనంచేయాలి. ఆ రాత్రికి పాలు, పండ్లు మాత్రమే స్వీకరించాలి.
```
*🪷4. నాల్గవరోజు కార్యక్రమం:~*```
ఉదయమే గంగాస్నానం విశ్వేశ్వ రుడి దర్శనం చేసి డుండి వినాయకుణ్ణి చూసి దండపాణి ఐన కాలభైరవుని పూజించాలి. “ఓం కాశ్యై నమః ‘’అని 36సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి. గుహను, భవానీ దేవిని దర్శించాలి. మధ్యాహ్నానికి మణికర్ణికను చేరి మట్టిలింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణావిశ్వేశులను దర్శించి భోజనం చేయాలి. రాత్రి నామ స్మరణ పాలు,పండ్లు ఆహారం.```
*🪷5. అయిదోరోజు కార్యక్రమం:~*```
ప్రాతఃకాలాన్నే గంగాస్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి రుద్రాభిషేకం నిర్వహించాలి. తర్వాత తిలాభాన్దేశ్వర, చింతామణి గణపతిని సందర్శించి, దుర్గాదేవికి ఒడి బియ్యం, దక్షిణ సమర్పించి గవ్వలమ్మను చేరి పూజించి (ఈమెనే కౌడీబాయి అంటారు) అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనంచేయాలి. రాత్రికి పాలూ, పండ్లూ తీసుకోవాలి.```
*🪷6. ఆరోరోజు కార్యక్రమం:~*```
తెలవారకముందే గంగా స్నాన మాచరించి, బ్రాహ్మణ ముత్తైదువులపూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసివాయన చేటల దానాలిచ్చి, బేసిసంఖ్యలో జనానికి వాయన దానాన్ని చేయాలి. వ్యాసకాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని, శ్రీశుకులను దర్శించి, కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి. ఆ తర్వాతే భోజనం. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.```
*🪷7. ఏడవ రోజు కార్యక్రమం:~*```
గంగాస్నానం, నిత్యపూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిదితో సరిపెట్టుకోవాలి. ఇరవైఒక్కఉండ్రాళ్ళను, నూట ఎనిమిది ఎఱ్ఱటి పూలతో పూజించాలి. ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలాలివ్వాలి. డుండి వినాయకుడినర్చించి,అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం, గాజులు సమర్పించాలి. ఇలాగే విశాలాక్షికీ చేయాలి. విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన, సహస్ర బిల్వార్చన, హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి.```
*🪷8. ఎనిమిదో రోజు కార్యక్రమం:~*```
గంగాస్నానం, నిత్యపూజ తర్వాత కాలభైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి. ఆ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్టగా గడపాలి. ఐదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనంపెట్టాలి. దక్షిణ, తాంబూలాలు సమర్పించాలి. రాత్రి కాలభైరవస్మరణ చేస్తూ నిద్రించాలి.```
*🪷9. తొమ్మిదో రోజు కార్యక్రమం:~*```
గంగాస్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి,పూజించి, జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణలు సమర్పించి ఆశీస్సులు పొందాలి. రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్రించాలి.```
*🪷10. పదవ రోజు కార్యక్రమం:~*```
”నవదిన యాత్ర” పూర్తి చేసి పదోరోజు గంగాస్నానం ఆచరించి గంగను పూజించి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి ప్రయాణం కావాలి.```
*దర్శనాత్ అభ్రశదసి*
*జననాత్ కమలాలయే*
*స్మరణాత్ అరుణాచలే*
*కాశ్యాంతు మరణాన్ ముక్తిః*```
చిదంబరం వెళ్లి దర్శనం చేసుకున్నా..
తిరువారూరులో జన్మించినా..
అరుణాచలేశ్వరుణ్ణి స్మరించుకున్నా..
కాశీలో మరణించినా..
ముక్తి లభిస్తుంది... అన్నారు
కనుక కాశీలోనే నివాసం ఏర్పరుచుకోవడమే ఉత్తమమేమో కదా..!✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment