Thursday, January 16, 2025

" గౌతమ బుద్ధుడు" సమాజానికి అందించిన సిద్ధాంతాలు, సందేశాలు.

 🚩💐💐💐💐🚩"
      " MAZUMDAR "
            🌹🌹🌹
📣" ఈరోజు మనం 
" గౌతమ బుద్ధుడు" సమాజానికి అందించిన సిద్ధాంతాలు, సందేశాలు. చదువుదాం! 
     🥁🥁🥁
1)" నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు!  కానీ, ఆ కారణంతో ఇతరులకు హాని చేయకూడదు."

2)" ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్ని చూస్తారు."

3)" మనసు చెప్పినట్లు మనం వినటం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి."

4)" సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది."

5)" అహంకారం, మమకారం, లభించినప్పుడు పరిపూర్ణ శాంతి దొరుకుతుంది."

6)" ఈ ప్రపంచంలో  ద్వేషాన్ని , ద్వేషం ద్వారా నిర్మూలించలేం ప్రేమ ద్వారా మాత్రమే దాన్ని పరి మార్చగలం."

7)" కోపాన్ని దయతోను, చెడును మంచి తోను, జయించటానికి ప్రయత్నించండి!"

8)" గాలి ఎటు వేస్తుంటే అటు పుష్పం పరిమళం కూడా వ్యాపిస్తుంది. కానీ సత్పురుషులు చేసిన 'సత్కార్యాలు' గాలికే ఎదురుగా వెళ్లి కీర్తిని వ్యాపింప చేస్తాయి."

9)" గంధం కన్నా! జవ్వాది కన్నా! తామర మల్లెపూల పరిమళాల కన్నా!  సుగుణాల 'పరిమళం' ఉన్నతమైనది."

10)" నీ బాధలకు కారణం ఏదైనా! కావచ్చు,  ఎవరైనా కావచ్చు, కానీ ,ఆ బాధ నివృత్తి కోసం ఇతరులకు 'హాని' చెయ్యకు".
🚩💅🏼💅🏼💅🏼💅🏼🚩

No comments:

Post a Comment