*🗣నేటి జాతీయం🤔*
*గయ్యాళి గంప*
ఎక్కువగా నోరు చేసుకునే స్త్రీనిగురించి ఈ మాట వాడతారు
ఉదా: సూర్య కాంతం గయ్యాళి గంప పాత్రకు పెట్టింది పేరు. సూర్యకాంతం పేరు ఎంత అందమైనదో...... ప్రతి ఒక్కరికి తెలుసు. కాని ఆ పేరును తమ పిల్లలకు పెట్టుకునేందుకు జనం జంకుతారు. కారణం? సూర్య కాంతం గారు గయ్యాళి పాత్రలో జీవించిన విధానం. ఆమె నటనా కౌశల్యానికి ఎన్ని బిరుదులిచ్చినా ..... అవన్ని దీనికంటే పెద్దవి కావు. అవునా? కాదా ? అది ఎవరో పనిగట్టుకొని ఇచ్చిన బిరుదు కాదు. జనబాహుళ్యంలో అనుకోకుండా ఆమెకు సహజంగా అమరిన బిరుదు.
No comments:
Post a Comment