Friday, January 10, 2025

 *ఒక మెతుకు శాపం*
 సురేష్ చదువు లో చాలా చురుకైనా వాడు... అన్నిటిలో *కి* ఫస్ట్.. కానీ కొద్దిగా నిర్లక్ష్యం..  విషయం ఏదయినా ఇక తిండి తినటం కూడా శ్రద్దగా తినడు ఏదో ఆలా కానిచ్చేసా అన్నట్టు *లా* తింటాడు... కనీసం రెండు మూడు ముద్దలు ఉండగా చేతులు కడిగేస్తాడు.. 
ఇంజనీరింగ్ అయింది కాంపిటీషన్ పరీక్షలు రాయటానికి *రు* పెద్ద ఊరికి వెళ్లి పేరున్న కోచింగ్ సెంటర్ లో చేరాడు.. బాగా చదవడం తెలిసిన వాడు చదువు నిర్లక్ష్యం అనే మాట *నా* లేదు.. ప్రిలిమ్స్ సులభంగా దాటాడు... మెయిన్స్ కొద్ది *గ* కష్టపడ్డాడు.. అది అయింది.. ఇక ఇంటర్యూ కోసం దాదాపుగా నిద్ర త్యాగం చేసి ప్రేపరషన్ అవుతున్నాడు ఏమవుతుందో ఏమో అనే భయం వెంటాడుతూ ఉంది. 
ఆ ఇంటర్వూ రోజు ఉదయం స్నానం చేసి శుభ్రం గా తయారు అయి దేవుని గుడికి వెళ్లి ప్రశాంతం గా వెళ్ళాడు.. 
ఇంటర్యూ సమయం *రా* నే వచ్చింది.. వాళ్ళు అడిగిన వాటికి సమాధానం కంటే తడబడుతూ లోపలికి వెళ్లడం.. సమాధానాలు తెలిసినట్టు ఉన్నా ఏదో సందేహం తో ఏమి సమాధానం ఇస్తున్నాడో అయోమయం.. 
పరీక్షలు రాయటం బాగుంటుంది కానీ ఇలా ఎదురుగా ఉండి సమాధానం ఇవ్వటం కొద్దిగా కష్టమే అనిపించింది. 
బాగా ఆకలి గా ఉంది కాస్త దూరంగా ఏదో మెస్ లో ప్లేట్ భోజనం టికెట్ తీసుకొని ఇంటర్వూ గురించి ఆందోళన తో అన్నం ఆలా గెలుకుతూ తింటూ.. ప్లేట్  లో భోజనం అంతా తినేశాడు.. 
అబ్బా ఈ రో *జు* ఎంత ఆకలి ఉన్నదా మొత్తం తినేసానే అనుకుంటూ ప్లేట్ వైపు చూస్తే అక్కడక్కడా కొన్ని అన్నం మెతుకులు కనిపించాయి. చేతులు కడుగబోయే సమయంలో 
ఎందుకో చేతులు ఆగిపోయాయి.
అవునూ ఈ కొన్ని మెతుకులు...ఇప్పుడు నా పరిస్థితి లో ఉన్నాయా అనిపించింది.
నిజమే.. వరి నాట్లు వేసిన చెట్టుకు వడ్ల గింజలా ఉన్న ఆ గింజలు చేనులో రాలి పోయి ఉంటే ఏదయినా పిచ్చుక లకు ఆహారం అయి ఉండేది.. వడ్లు బియ్యంగా మారె సమయంలో పడి పోయి ఉంటే ఏమయ్యేదో.. బస్టాలకు తోడు తున్నాపుడు ఆ బస్తాలు మధ్య జారి పోకుండా ఈ హోటల్ కి చేరింది.. వండటానికి తీస్తున్నారు అంటే అక్కడ జారి పోలేదు.. కడుగుతున్నపుడు.. వార్చు తున్నాపుడు వడ్డీస్తున్నపుడు పాత్ర కో.. వడ్డింటే గరిటె కో, పాత్ర మూతకో అతుక్కోకుండా హమ్మయ్య తినే పళ్లెం లోకి వచ్చి పడ్డాను.. ఇదేంటి పప్పు కలుపుతున్నాపుడు నన్ను తీసుకోలేదు, సాంబార్, రసం లతో కూడా కలవలేక పోయాను.. అని ఆ మెతుకులు ఆందోళన పడుతున్న సమయంలో హమ్మయ్య పెరుగు తో కలిశాను.. 
ఒక ముద్ద.. మరో ముద్ద.. ఇంకో ముద్ద.. అయ్యో చివరి ముద్ద కూడా తినేశాడే.. అయ్యో చేతులు కడుగ బోతున్నాడే ఇక నా పరిస్థితి ఏమిటి అని *ఆ అన్నం మెతుకులు చూస్తున్నట్లుంది* 
అవును ఈ మెతుకులు ఎన్ని గండాలు తప్పించుకొని వచ్చాయి..
మరి నేను తినకుండా చేతులు కడిగేస్తున్నానే.. పోనీ కడుపులో ఖాళీ లేదా.. 
అరె మొత్తం మెతుకులు కలిపితే ఒక ముద్ద కాదే.. *ఈ మెతుకులు నాకు శాపం పెడితే... నా కష్టం తెలియని నీవు నాలా ఎంత దూరం ఎన్ని అడ్డంకులు దాటి వచ్చినా చివరికి... సింకులో* నన్ను చేర్చి నట్టు అవుతావు అని శాపం పెట్టడం లేదు కదా. 
అనే ఆలోచన మెదిలింది. 
వెంటనే 
ప్రతి మెతుకు తీసుకుంటూ.. 
*మాతా అన్నపూర్ణేశ్వరి* 
అని నమస్కారం చేసుకుంటూ ఇక జీవితంలో తినే పదార్థాలను వృధా చేయను అనుకుంటూ తినేశాడు. 
*తిన్న తరువాత చేయి కడగటానికి ఇంతసేపు ఏమి ఆలోచన అని ముఖ్యమంత్రి మీటింగ్ కి వచ్చిన సురేష్ తోటి ప్రక్క జిల్లా కలెక్టర్* అడిగేదాకా ఆ రోజు మెస్ లో పడిన ఆందోళన మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తుకు వస్తుందో అర్థం అయింది. నన్ను ఆ రోజు నుండి యే మెతుకు శాపం పెట్టదని.

Sekarana

No comments:

Post a Comment