Saturday, January 11, 2025

****సమాజంలో ఆడవాళ్ళకు ఉన్న బిరుదులు

 *`మన సమాజంలో ఆడవాళ్ళకు ఉన్న బిరుదులు తెలుసా.....`*

*మగతనం లేని మగాడితో  పెద్దలంతా ఏకమై పెళ్లిచేసి ఆడదానిని కట్టబెట్టి, పిల్లలు పుట్టకపోతే ఇచ్చే....*
              *బిరుదు గొడ్రాలు.*

*మందు తాగి తాగి ఆరోగ్యం నాశనం చేసుకుని కట్టుకున్నవాడు (అనేక రకాల కారణాలు )కాలం చేస్తే, ఆడదానికి కట్టబెట్టే*
                  *బిరుదు ముండమోపి*

*మగాడి శరీర వాంఛ తీర్చుకోడానికి వేశ్యాగృహం, అక్కడ ఆడదానికి కట్టబెట్టే* 
                  *బిరుదు వేశ్య*

*మగాడు నచ్చిన జీవితం నచ్చినవాళ్ళతో సహజీవనం సాగిస్తే ఆడదానికి కట్టబెట్టిన*       
                   *బిరుదు ఉంపుడుగతే.*

*అత్తఇంట్లో కష్టాలు భరించలేక, అడుగు ముందుకు వేసి విడాకులు ఇచ్చి తన పిల్లలు తో విడిగా ఉంటే కట్టబెట్టే*
                *బిరుదు బరితెగించింది..*

*మగాడికి ఉన్న బిరుదు "ఆడు మగాడు"* 
*మగాడు ఎం చేసిన అనేది ఆడు మగాడు...*
*ఎం మగాళ్లకు కొమ్ములు ఉన్నాయా*

*జీవితాన అన్ని వసంతాలు దూరమై వాడిపోయిన* 
*జీవితాన్ని అనుభవిస్తున్న మహిళ ఓ ఇంద్రధనుస్సు..*

*ఒక్కరోజు తనలా జీవించి రండి కన్నీళ్లతో కాపురం చేస్తున్న* 
*దేవత కనిపిస్తుంది.*
*మౌనంగా మనసులోని రాగం అర్థం అవుతుంది.*

No comments:

Post a Comment