Saturday, January 18, 2025

*****ఈగలా కాదు తేనెటీగలా ఉండాలి! Telugu Motivational Inspirational Words VIDDU'S WORLD Life Quotations

ఈగలా కాదు తేనెటీగలా ఉండాలి! Telugu Motivational Inspirational Words VIDDU'S WORLD Life Quotations



హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్దూస్ వరల్డ్ భారతదేశంలో 19వ శతాబ్దపు ఒక గొప్ప యోగి పుంగవుడు శ్రీరామకృష్ణ పరమహంస దైవత్వాన్ని వివిధ రూపాల్లో అనుభూతి చెంది ప్రతి మనిషిలో పరమాత్మ నిండి ఉన్నాడని నమ్మిన యోగి ఆయన అన్ని వర్గాల మనుషులకు ఆధ్యాత్మిక మార్గము ద్వారా దివ్యత్వాన్ని ముక్తిని పొందడానికి మార్గం చూపిన మహనీయుడు శ్రీరామకృష్ణ పరమహంస 1836 లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన 1886 లో తన శరీరాన్ని విడిచిపెట్టారు తన మరణానికి ముందు తాను సంపాదించిన మార్మిక ఆధ్యాత్మిక దివ్య శక్తులను ప్రియ శిష్యుడైన స్వామి వివేకానందకు ధారపోసి నిర్యాణం చెందారు శ్రీరామకృష్ణ పరమహంస కేవలం 50 సంవత్సరాలే జీవించినప్పటికీ ఆయన బోధించిన మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి వాటిలో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం చెరువులో చేపలు పట్టాలంటే ముందుగా చేపలు పట్టే కళను నిపుణుల నుండి నేర్చుకోవాలి ఆ తర్వాత ఎంతో ఓపికతో నీళ్లలో గాలం వేసి కూర్చోవాలి కొంతసేపటికి చేప ఎర్రను పట్టుకుంటుంది గాలం కదలిక తెలియగానే చేపను ఒడ్డు పైకి లాగేయాలి అదేవిధంగా కేవలం ఆకాంక్ష ఉన్న ఉన్నంత మాత్రాన భగవత్ సాక్షాత్కారం లభించదు సాధు పుంగవుల ఉపదేశాలలో విశ్వాసం ఉంచాలి మనస్సును గాలంలా ప్రాణాన్ని కొక్కెంలా తయారు చేసుకోవాలి నీ భక్తి జపం ఎర్ర లాంటివి నిజమైన సాధన అంటే నీ ఆలోచనలు నువ్వు చేసే పనులు రెండు సమన్వయం అయి ఉండాలి పైకి భగవంతుడే సర్వస్వం అని అంటూ నీ చేతల్లో ప్రాపంచిక భోగాల పట్ల మకువను ప్రదర్శిస్తే నీ సాధన అంతా వృధాయే అవుతుంది రజకుడి దగ్గర ఉతకడానికి తెచ్చిన బట్టలు అనేకం ఉంటాయి కానీ అవేవి అతడివి కావు ఉతకగానే ఆ బట్టలను తిరిగి యజమానికి అప్పగిస్తాడు అలాగే జీవితంలో ఎన్ని వస్తువులు నువ్వు సేకరించినా అవి నీ దగ్గర తాత్కాలికంగానే ఉంటాయనే విషయం మరచిపోకూడదు మనస్సు యొక్క స్వభావం చంచలంగా ఉంటూ పలు విధాలుగా పరుగులు తీస్తూ ఉంటుంది అది నిలకడ కలిగి ఉండదు నిద్రలో కూడా కుదురుగా ఉండక ఏవో కలలు కంటూ ఉంటుంది రకరకాల ఆలోచనలు మనసును కలవరపరిచి బలహీన పరుస్తాయి అయినా సరే ఆధ్యాత్మిక పోరాటాన్ని ఆపకూడదు మనసును నిగ్రహించడం కష్టమైన సరే అది చేయవలసిందే ఇంకో మార్గం లేదు భగవంతున్ని గురించి ఆలోచనలు అధికమవుతూ వస్తే ఇతరమైన ఆలోచనలు తగ్గుముఖం పడతాయి మనస్సును ఏకాగ్ర పరచడానికి దాన్ని దీపం మీద నిలపడం అతి సులువైన మార్గం దానికి సరిగ్గా మధ్య నుండే నీలి భాగం కారణ శరీరం దాని మీద మనస్సును నిలపడానికి ప్రయత్నించడం చేత శీఘ్రంగా ఏకాగ్రత అలవడుతుంది దీపంలో నీలాంశం చుట్టూ ఉండే తేజోవంతమైన భాగం సూక్ష్మ శరీరాన్ని పోలుతుంది దాన్ని ఆవరించుకొని ఉండే భాగమే స్థూల శరీరం వంట పాత్రను రోజు తోమాలి లేకుంటే చిలుము పట్టి పాడై పనికిరాకుండా పోతుంది అలాగే మనసును ప్రతిరోజు రోజు సాధన ద్వారా శుభ్రపరుస్తూ ఉండాలి లేకుంటే మనసు అపవిత్రత పెరుగుతూ పోతుంది ఒక సంసారి యొక్క మనస్సు ఈగ లాంటిది ఈగ కొన్ని సమయాలలో తీపి పదార్థాలపై మరికొన్ని సమయాలలో చెత్త కుప్ప పై వాలుతుంది అలాగే సంసారి మనసు ఒకసారి భగవంతుని విషయాలపై ఇంకొన్ని సార్లు తుచ్చమైన కోరికలపై ఉంటుంది ఆ ఈగ కేవలం మకరందం కోరే తేనెటీగలా మారాలి అంటే మనసుని భగవంతుని విషయాలపై తప్ప తుచ్చమైన విషయాలపై పోకుండా చూసుకోవాలి చేసిన తప్పును ఈరోజు కప్పి పుచ్చుకున్నంత మాత్రాన రేపటి పర్యావసానాన్ని తప్పించుకోలేరు అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడం మన వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంతో కీలకం మాట్లాడడం దేవుడు ఇచ్చిన వరం కానీ అదుపులో ఉండి మాట్లాడితే మనకు మంచిది ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైన వాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకున్నవాడు వివేకవంతుడు ఎంతటి విషమ పరిస్థితులు ఎదురైనా మంచితనం మానవత్వాలపై నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం మానేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి సంతృప్తి గలవాడు నిత్య సంపన్నుడు అత్యాశపరుడు ఎప్పటికీ పేదవాడే సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోతాడు పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం తొందరపాటులో ఉన్నప్పుడు మాట్లాడకపోవడమే మంచిది ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం సోమరితనం మనిషి పతనానికి కారణం అవుతుంది అందరిలో మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ మంచి పెరుగుతుంది మనం ఇష్టపడింది దొరకనప్పుడు మనకు దొరికిన దాన్నే ఇష్టపడాలి నీ కోసం చప్పట్లు కొట్టే రెండు చేతుల కన్నా కన్నీరు తుడిచే ఒక వేలు మిన్న కలియుగంలో తపస్సు చేయడం అంటే సత్యం పలకడమే లౌకిక చింతలు తాపత్రయం నీ మనసును కలవరపెట్టనివ్వకు సత్క కర్మలు సకాలంలో నిర్వర్తిస్తూ నీ మనస్సును మాత్రం సదా భగవంతుని యందు నిమగ్నం చేయి అప్పుడు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు [సంగీతం] 

No comments:

Post a Comment