అభినందనల కంటే విమర్శలే ఎక్కువ || Telugu Motivational Inspirational Quotes Ramana Maharshi
Youtube link - https://youtu.be/iToswrmNjak
[సంగీతం] హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ తమిళనాడులో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రమణ మహర్షి ఒక భారతీయ ఋషి జీవన్ముక్తుడు భగవంతున్ని తెలుసుకోవడానికి రకరకాల సాధనలను మార్గాలను సూచించారు రమణ మహర్షి బోధనలలో ఆత్మజ్ఞానం ప్రధాన అంశంగా ఉండేది వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు తన చెడు ఆలోచనలు అహంకారం గర్వం వ్యసనాలే జీవితాన్ని నిర్వీర్యం చేసి నాశనం చేస్తాయి కర్మానుసారంగానే సృష్టికర్త మనుషుల జీవితాన్ని నడుపుతాడు జరగదని రాసి పెట్టబడింది ఎవ్వరు ఎంత ప్రయత్నించినా జరగదు అదేవిధంగా జరుగుతున్న అని నిర్ణయించబడింది ఎవరు ఎంత అడ్డుపడినా జరగక మానదు మానవత్వం ఒక సముద్రం వంటిది సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రం అంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు కాబట్టి కొంతమంది చెడ్డవాళ్ళ కారణంగా మానవత్వం పై నమ్మకం కోల్పోవద్దు మీరు ఎప్పుడైనా మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు ముందు పరిస్థితిని అర్థం చేసుకోవాలి స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడమే ఉత్తమం భగవంతుడు మీకు ఓ అద్దంలా ఉంటాడు భగవంతుడికి మీరు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు మీకు అంతే దూరంలో ఉంటాడు ఉన్నాడు అని దృఢంగా విశ్వసిస్తే అద్భుతాలు సాధిస్తారు మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిలా ఉండవచ్చు ఒక్కోసారి పరిసరాల నుండి పారిపోయేలా చేయవచ్చు కానీ నిజానికి అవన్నీ పేక మేడలే వాటికి బలమైన పునాది అంటూ ఏదీ ఉండదు ఈ విషయం గ్రహించి వాటి మీద నుండి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోతాయి ఒక్కసారి కళ్ళు మూసుకోండి మనస్సు అనేకమైన ఆలోచనలుగా విస్తరిస్తుంది కొద్దిసేపటికి ప్రతి ఆలోచన బలహీన పడుతూ ఒక్కొక్కటిగా నశించిపోయి మనసు ఏకాగ్రతను పొందుతుంది ఇలా అభ్యాసం చేయగా చేయగా మనసు ఆలోచనల బానిసత్వాన్ని తెంచుకొని ప్రశాంతంగా మారుతుంది అప్పుడు మీ జీవితంలో ప్రతిదీ స్పష్టంగా అర్థమవుతుంది ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్లడం లాంటిది అక్కడ మనం ఏం కొనకపోయినా కొంత సువాసనని పిలుస్తాం అలా కాకుండా చెడ్డవారితో స్నేహం చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే ఇది తప్పని ఇది ఒప్పని విమర్శించవద్దు విమర్శల వల్ల ఎవ్వరూ బాగుపడరు నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పొప్పులు తెలుస్తున్నాయా లేదు కదా అందువల్ల మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చేయాలి నీ మనసు నిలకడ చెందినప్పుడే ఇది సాధ్యమవుతుంది జ్ఞానం సిద్ధిస్తుంది మౌనంగా ఉండడం వల్ల నీ ఇచ్చా పెరుగుతుంది అప్పుడు నువ్వు కోరుకునే స్వర్గం నీలోనే ఉంటుంది మనిషి మనసుకి బానిస మనసు మాయకి బానిస మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగిపోతుంది మాయ తొలగితే మనసు నిర్మలం అవుతుంది మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతున్ని ధ్యానించడం శ్రేష్టం జీవితంలో ఏదైనా పొందిన తర్వాతే ఆనందంగా ఉంటుందని నమ్మడం మూర్ఖత్వం అసలు రహస్యం ఏంటంటే ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్లే విజేతలుగా నిలుస్తారు దేనిని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రియ శక్తి అన్ని తలంపుల పుట్టుకకు కారణం అదే కాబట్టి మనసు మనసును స్వాధీన పరుచుకోవాలి మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా అదంతా మీ మనస్సుకు శిక్షణ ఇవ్వడానికి శరీరం మరణించిన తర్వాత ఏదైతే మీతో వస్తుందో దాన్ని పవిత్రం చేయడానికి దాన్ని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ మీ మీద ఇష్టం లేక కాదు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా అయితే పవిత్రం చేస్తారో అలా మిమ్మల్ని కూడా ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికే ఆ భగవంతుడు ఇలా చేస్తాడు ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టా ఇష్టాల మీద ఏ మాత్రము ఆధారపడి ఉండదు ఎటువంటి కోరిక సంకల్పం ప్రయత్నం లేకుండానే సూర్యుడు ఉదయిస్తాడు కేవలం సూర్యుని ఉనికితో కమలం వికసిస్తుంది నీరు ఆవిరవుతుంది ప్రజలు వివిధ రకాలైన పనులు చేసి విశ్రాంతి పొందుతారు అలాగే మానవుడు కూడా నిరంతరం ఇలా పరోపకారిగా వ్యవహరించాలి ఎల్లప్పుడూ మంచి వారితోనే స్నేహం చేయాలి చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది నువ్వు చేసే ఏ ప్రయత్నము వృధా కాదు నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించాల్సిందే అది మంచైనా చెడైనా జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలడు ఎవరి సన్నిధిలో అయితే తిరుగుబోతే మనస్సు శాంతిని పొందుతుందో వారిని జ్ఞానిగా గుర్తించాలి ధ్యానం అంటే ఆలోచనలపై మనస్సు చేసే యుద్ధం ధ్యానం మొదలు పెట్టగానే ఆలోచనలు నిన్ను ముట్టడిస్తాయి అయితే నీ సత్సంకల్పం క్రమంగా బలపడి వాటన్నింటిని పారద్రోలుతుంది ప్రశాంతత నాలుగు రకాలు మాటలకు సంబంధించింది కళ్ళకు సంబంధించింది చెవులకు సంబంధించింది మనసుకు సంబంధించింది వీటిలో మానసిక ప్రశాంతత ముఖ్యమైనది గొప్పది కూడా సన్మానించినప్పుడు పొంగిపోకుండా అవమానింపబడినప్పుడు కృంగిపోకుండా కోపం వచ్చినప్పుడు కూడా ఎవ్వరిని పరుషమైన కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండేవాడు సాధువు నువ్వు వాడిలా వాడు నీలా ఉండాలనుకోవడం విచారకరం అలా కాకుండా నువ్వు నీలా ఉండడం ఎప్పటికైనా ఉత్తమం జనం ఎంత సులభంగా మిమ్మల్ని పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా కాబట్టి నిందా పొగడ్తలను పట్టించుకొని మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలి ఆనందం మూడు విధాలుగా ఉంటుంది విషయానందం భజనానందం బ్రహ్మానందం కామం సంపదలు కీర్తి ప్రతిష్టల వల్ల కలిగే ఆనందం విషయానందం భగవంతుని నామ గుణ కీర్తనలు చేయడం భజనానందం భగవంతుని దర్శనం వల్ల లభించే ఆనందం బ్రహ్మానందం మీరు ఇతరులను ఏమీ అడగ వద్దు మీ అవసరాలను భగవంతుడే తీరుస్తుంటాడు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి మీ చుట్టూ జరిగే విషయాల గురించి చింతించకండి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మీ కాలాన్ని వృధా చేస్తుంది అద్దే ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏంటంటే అద్దే ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు జ్ఞానికి ఈ శరీరం అదే ఇల్లు లాంటిది చాలామంది దేవుని ఉనికిని విశ్వసించరు కానీ నువ్వు ఉన్నావన్న వాస్తవమే దేవుడు ఉన్నాడు అనడానికి తిరుగులేని సాక్ష్యం తనలోని లోపాలను గుర్తించకుండా ఇతరులలో లోపాలు వెతికేవాడు మూర్ఖుడు తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం జీవితంలో ఎదుగుదల కనిపించడం లేదని బాధపడకు మహా వృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది దానికి కొంత సమయం పడుతుంది భక్తులు తమ గురు పాదాలను తలుచుకున్న వెంటనే వారి హృదయంలో ఉన్న తీవ్రమైన అజ్ఞానం నశించి ఆ క్షణమే వారికి పరమ పదం లభిస్తుంది అహంకారం గర్వం విడిచిపెట్టిన వారికే దైవ దర్శనం కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు [సంగీతం]
No comments:
Post a Comment