*🧘♂️నాసదీయ సూక్తం🧘♀️*
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
(ఋగ్వేదం – మండలం10)
The Beginning of Universe
It was not clear to science even today what is the beginning of this Universe. Veda ( Rigveda expressed the nature of the beginning, its structure and character thousands of years ago) expression on the beginning is still appealing for today’s science or fiction.
Nasadiya Sukta of Rig Veda is about Big Bang theory and creation of Cosmos.
*నాసదీయ సూక్తము - ఋగ్వేదము*
నాసదా సీన్నో సదాసీత్తదానీం నాసీద్రజో నో వ్యోమా పరో యత్ |
కిమావరీవ కుహ కస్య శర్మన్నమ్భ కిమాసీద్గహనం గభీరమ్ ||
న మృత్యురాసీదమృతం న తర్హినరాత్ర్యా అహ్న ఆసీత్ప్రకేతః |
ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్న పరః కిం చనాస ||
తమ ఆసీత్తమసా గూళ్హమగ్రే౭ప్రకేతం సలిలం సర్వమా ఇదమ్ |
తుచ్ఛ్యేనాభ్వపిహితం యదాసీత్తపసస్తన్మహినాజాతైకమ్ ||
కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేత ప్రథమం యదాసీత్ |
సతో బన్ధుమసతి నిరవిన్దన్హృది ప్రతీష్యా కవయో మనీషా ||
తిరశ్చీనో వితతో రశ్మిరేషామధః స్విదాసీ దుపరి స్వీదాసీ త్ |
రేతోధా ఆసన్మహిమాన ఆసన్స్వధా అవస్తాత్ప్రయతిః పరస్తాత్ ||
కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్కుత ఆజాతా కుత ఇయం విసృష్టిః |
అర్వాగ్దేవా అస్య విసర్జసేనాథా కో వేద యత ఆబభూవ ||
ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధే యది వా న |
యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్సో అంగ వేద యది వా న వేద ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః
🕉️🕉️🕉️
(An expression of energy as matter)
నాసాదాసీనో సదాసీత్ తదానీం నాసీద్రజో నొవ్యోమా పరో యత్కిమావారీవాహ కుహకస్య శర్మాన్భః కిమాసీత్ గహనం గభీరం – 1
1.సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు (సత్ లేదు, అసత్ లేదు). అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు. ఏదో ఉంది. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది. కానీ ఇదంతా దేనిచే/ఎవరిచే ఆవరించబడి ఉంది? అది ఎక్కడ ఉంది?
ముందు సత్తుగానీ అసత్తు గానీ లేదు . భూమి గానీ ఆకాశం గానీ లేదు. అగాధమైన, గంభీరమైన వెల్లువ తో ఆవరించిన అనుభవం వుంది.
నమృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత హ అనీదవాతం స్వధయా తదేకం తస్మాధ్యాన్నన్న పరః కించనాస – 2
2.మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు. అన్నిటికి అతీతమైన తత్వం మాత్రమే ఉంది. అది దేనీ మీద ఆధారపడిలేదు. ఆ బ్రహ్మం తప్ప వెరొకటిలేదు.
అప్పుడు మృత్యువు, అమృతము , రాత్రిమ్బవళ్ళు లేవు . శ్వాస లేని ఆ ఒక్కటి ఉన్నది . స్వయంగా అది తరువాత శ్వాసించింది.
వ్యాఖ్య – మనిషి తన శరీరమునుండి విశ్వకేంద్రం దాక శోధించి రెండూ ఒకటేనని అంతర్ద్రుష్టితో వ్యక్తిత్వాన్ని విస్తరించడం యోగం . దాన్ని తెలిపే జ్ఞానమే వేదం . మహర్షులు శాశ్వత తత్వాన్నీ కనుగొనడానికి చేసిన ప్రయత్నం ఇది.
దీనికి సమతుల్యత భావం , దాన్ని సాధించడానికి నిరంతరం ఇంద్రియ నిరోధం, మానసిక సంయమనం చేయాలని అర్థం చేసుకుని, ఆచరించి చెప్పిన మాటలే వేదం . ఈ క్రమంలో శరీరం ప్రకృతితో మమేకమై జీవించడం భోగం. ప్రకృతితో మమేకమై భోగించకుండ ఉండటం యోగం. అదే నిష్కామ కర్మయోగం. ఈ యోగంలో అశాశ్వతమైన శరీరం నుండి శాశ్వత తత్వమైన మనస్సుకు, బుద్ధికి , శక్తికి ఆవల, ఆదిలో వున్న ఏక తత్వం అనుభవానికి వస్తుంది . ముందు ఉన్నది అదే చివర చేరాల్సింది అదే.
తేడా మాత్రం చైతన్య రహితమైన ఆది నుండి చైతన్య సహితమైన ఆది లోనికి ప్రవేశించడమే జీవిత పరమార్థం .
ఈ గమనంలో చుట్టూ ఆ చైతన్యాన్ని ఆవరించి ఉన్న శరీరాన్ని , కుటుంబాన్ని , సమాజాన్ని , ప్రపంచాన్ని, ప్రకృతిని , విశ్వాన్ని మనతోపాటు తీసుకుపోయే ప్రయత్నం గానీ లేదా ఆ విషయం చెప్పే ప్రయత్నం గానీ చెయ్యడం సాంఘిక ధర్మం . అది చేయకపోతేె మనలోని ఛైతన్యం చుట్టూ ఉన్న ఆవరణతో సమతుల్యంగా , సంయమనంగా ఉండలేదు .
విడిగా దూరంగా ఉండాలనుకుంటే ఏ బంధము లేకుండా జీవితం గడపాలి. ఇతరులతో బంధం తగిలించుకొని పాటించకపోతే కర్మబంధమై తిరిగి కర్మకు కారణమౌతుంది . అందుకే వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి చివరికి సన్యాసంతో ముక్తుడు కావాలని చెప్పారు.
విశ్వ కేంద్రంగా ఉంటూ నిమిత్తమాత్రంగా ఉండడం శివ తత్వం . నిమిత్త మాత్రంగా ఉంటూ ప్రకృతితో ప్రకృతిలో సంయమనంగా ఉంటూ సమతుల్యతా క్రియ చేయడం విష్ణు తత్వం . ఆది అంతము శివ తత్వమైతే మధ్య ఉన్న క్రియాశీలమైన చైతన్యమే విష్ణు తత్వం.
చైతన్యం విడిగా ఉన్నంతవరకు విష్ణు తత్వం అవసరం అవుతుంది . చైతన్యం శివశక్తి లేక స్థితి శక్తిలోనికి ఐక్యం కాగానే నిశ్చలమైన శివ తత్వమై ప్రకాశిస్తుంది . జీవిలో చైతన్యం ఉన్నంతవరకు విష్ణు తత్వంగ ఉండక. తప్పదు.
శరీర బంధం ఉన్నంతవరకు కర్మ బంధం తప్పదు. జీవన్ముక్తుడు కావాలంటే శరీర బంధం నుండి జీవుని విడదీయాలి . వారికీ ఎటువంటి పాప పుణ్యాలు అంటవు
జీవుడు చైతన్యం , బుద్ధి, మనస్సు , ప్రాణం ద్వారా శరీరానికి అరిషడ్వార్గాలతో బంధించబడి ఉంటాడు . తిరిగి అదే క్రమంలో వాటిని విడదీసి జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది .
అరిషడ్వార్గాలను క్రమబద్ధమైన , ధర్మబద్ధమైన జీవితంతోనూ, ప్రాణాన్ని ప్రాణాయామంతోను , బుద్ధిని ధారణతోను , మనస్సును ధ్యానంతో , చైతన్యాన్ని సమాధితోను నిలువరించాలి.
సంకల్పం జీవునితో మొదలై చైతన్యాన్ని ప్రేరేపించి , భావంగ మారి , ప్రేరణగా మారి , ఆలోచనగా రూపుదిద్దుకుని, భాషగా , క్రియగ మారి మనకు కావలసిన మార్పుగా రూపాంతరం చెందుతుంది.
తమ ఆసీత్ తమసా గూఢమాగ్రి ప్రకేతం సలిలమ్ సర్వమా ఇదంతుచ్యేనాభ్వాపిహితం యదాసీత్ తపసత్ తన్మహినాజాయతైకం – 3
3.అంతా అంధకారంతో ఆవృతమైన గాఢాంధకారం నెలకొని ఉంది. అవగాహనకి అందని ఆ బ్రహ్మం (బ్రహ్మ పదార్ధం) మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. అది ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!). తీవ్రమైన తాపం (వేడి) వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది, ఉనికి ఏర్పడింది. (బిగ్ బ్యాంగ్ జరుగగా అధికమైన వేడి పుట్టిందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్తున్నది.)
ముందు యావత్తూ అంధకారంతో ఆవరించబడి గుర్తుపట్టలేని వెల్లువగా సమస్తాన్ని ఇముడ్చుకొని ఒక్కటే ఏదయితే ఉందొ అదే అభివ్యక్తమౌతున్నది.
అప్పుడు ఉన్నది స్త్రీ కాదు పురుషుడు కాదు . ఆ ఒక్కటీ అనిర్వచనీయమైనది . విశ్వం యొక్క ఈ స్థితి ఇప్పుడు చెప్పే బిగ్ బాంగ్ ను పోలి ఉంది . అది చైతన్యాన్ని తనలో ఇముడ్చుకున్న స్థితి శక్తి . అందులోనుండి వెలువడిన చైతన్యం చరాచర పరాపర విశ్వంగా మారింది .
ప్రథమంగా ఉన్నది అంధకారమై ఇప్పుడు కనపడే సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఒక ఆవరణగా ఉంది . ఈ స్థితి ఏది అని కనుక్కోవడానికి శాస్త్రాలు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి . అందుకే ఋగ్వేదం దాన్ని అనిర్వచనీయమైనదని అన్నది.
కామస్తదగ్రే సమవర్ధతాది మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుంసతి నిరవిందన్ హృది ప్రతీప్యా కవయో మనీషా – 4
4.దానికి కారణం కోరిక (ఇచ్ఛ). అదే ప్రధమ బీజం, పరబ్రహ్మం యొక్క మనసు నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచే విశ్వావిర్భావం జరిగింది, విశ్వం వికసించింది. అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది. అనగా విశ్వం వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఏ ఋషులైతే దాని కోసం తమ హృదయాలను శోధించారో, వారికి శక్తికి, పదార్ధానికి, సత్తుకు, అసత్తుకు కారణమైన చైతన్యాన్ని దర్శించగలిగారు. వాటి మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.
మనస్సు ప్రథమ రేతస్సుతో మొదట హృదయంనుండి ఆకాంక్ష అంకురించబడినదని తెలుసుకున్న ఋషులు సత్యానికి అసత్యానికి ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు .
సత్యం అన్నది మూలం . అసత్యం అన్నది మూలం నుంచి వచ్చి తిరిగి అందులోనికి పోయేది అని అర్థం . సృష్టి పరంగానైనా శాస్త్ర పరంగానైనా ఈ నిజం ఒకటే . జగత్తులో ఒక్క మనిషి మాత్రం ఆ చైతన్యాన్ని గుర్తించి మూలంలోకూడా చైతన్యంగా వ్యవహరించగలుగుతాడు . ఆ చైతన్యం కలిగిన మనిషే దేవుడౌతాడు .
ఏ మనిషి ఇతరులకంటే శక్తిమంతుడు అయి ఇతరులకు ఉపయోగపడే కార్యం చేస్తాడో అతడే దైవంగా భావిస్తున్నారు . తన్ను తాను తెలుసుకున్నవాడు మూలం చేరి విముక్తడవుతాడు . ఇతరులకు ఉపయోగపడితే దేవుడవుతాడు .
తిరశ్చినో వితతో రశ్మిరేషామధ: స్విదాసీ దుపరి స్విదాసీత్ |
రెతొధా అసన్ మహిమాన ఆసన్ త్స్వధా అవస్తాత్ ప్రయతి: పరస్తాత్ || -5
5.మరియు శూన్యానికి, దానిపైన, క్రింద ఏమున్నదో, దానికి ఆధారమైనదేదో తెలుసుకోగలిగారు. అభ్యుదమైన ఆ శక్తి సారవంతమైనశక్తులను తయారు చేసింది. అన్నిటికిపైన చైతన్యశక్తి యొక్క ఉద్దేశ్యం, ప్రేరణ ఉంది, అదే దీన్ని నడిపిస్తోంది, క్రింద క్రమశిక్షణతో కూడిన సృజనాత్మకత ఉంది. అది ప్రేరణకు తగ్గట్టుగా నడుస్తోంది.
అతనిలో ఒక కిరణం ఏటవాలుగా ఉంది. ఆవెలుగు కిరణం క్రిందికి పైకి వ్యాపిస్తున్నది.అక్కడ బీజం ఉంది. అతనియందు మహిమలు న్నాయి. అతనికి స్వతంత్రమైన పనులున్నాయి.అతని యందు చైతన్య స్పందన ఉన్నది. శ్రేష్ఠమైన ప్రగతి ఉంది.అతని యందు (ప్రకాశించే)శక్తి ఉన్నది
పనులు =సృష్టి స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాది పంచ కర్మలు శక్తి = చిచ్ఛక్తి .
కోఅద్ధా వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం విసృష్టి: |
అర్వాగ్దేవా అస్య విసర్జనేనాథాకోవేద యత ఆ బభూవ || -6
6.కానీ ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుసు? దేవతలకు (పరబ్రహ్మం కాదు, పుణ్యఫలాల కారణంగా దేవతాజన్మను పొందిన వారు, ఇంద్రుడు, వరుణుడు, ఆదిత్యుడు, అగ్ని మొదలైనవారు) కూడా ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది (వారు కూడా ఈ తర్వాత వచ్చినవారే).
సరీగ్గా ఎవరికి తెలుసు ? అతడిని గురించి ఎవరు చెప్పగలరు? ఈ సృష్టి ఎక్కడినుంచి వచ్చిందో ఎవరు చూసారు?
దేవతలంతా తరువాత జన్మించిన వారు. ఎక్కడినుంచి ఈసృష్టి ఎలా వచ్చిందో ఎవరూ చూడలేదు. ముందు గాఉన్నది అతడు మాత్రమే.
ఇక్కడ దేవతలు అంటే పంచ బ్రహ్మలు.(స బ్రహ్మ స శివ, స హరి స్సేంద్ర: సొ అక్షర: పరమ స్వరాట్) .
ఇయం విసృష్టిర్యత ఆబభూవ యది వా దధేయ దివాన |
యో అస్యాధ్యక్ష: పరమె వ్యొమన్ సొ అంగ వేద యది వా నవేద || -7
7.ఈ సృష్టిని చేసి, దాని పగ్గాలు పట్టి నడిపిస్తున్నవాడికి నిశ్చయంగా ఇది ఎలా ఏర్పడిందో, దీనికి కారణం ఎంటో తెలిసే ఉండాలి. బహుశ అతనికి కూడా తెలియదేమో! (ఎవరికి తెలుసు?)
ఈ సూక్తంలో చెప్పిన చాలా విషయాలను ఆధునిక భౌతికశాస్త్రం కూడా వర్ణించింది. విశ్వోద్భవశాస్త్రం మీద, భౌతిక శాస్త్రం మీద అవగాహన ఉన్నవారికి ఇది స్పష్టంగా తెలుస్తుంది.
ఈ సృష్టి ఎక్కడినుంచి వచ్చింది, పరమా కాశం లో దీనిని ఎవరు ఉంచారు ? ఇది పరమాకాశం లో ఉన్న, అన్నిటికి అధ్యక్షుడైన విశ్వకర్మ ఆ సృష్టికర్తకే తెలుసు....లేదా ఆయనకు తెలియదని మనం అనుకోవచ్చు.
అన్ని యెరిగిన వాడు, సర్వసాక్షి ఆ పరమాత్మ యొక్కడే.
*సృష్టి పుట్టు పూర్వోత్తరాలు*
^^^^^^^^^^^^^^^^^
ఋగ్వేదంలోను, ఉపనిషత్తులలోను, దర్శనాలలోను, త్రిమత సిద్ధాంతాలలోను సృష్టిని గురించిన విచారణ విస్తారంగానే ఉంది. ఈ విశ్వం ఎక్కడ నుండి వచ్చింది? ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎంతకాలం ఉంటుంది? మొదలైన ప్రశ్నలకు సమాధానాలను మన ప్రాచీనులు వెతికారు. కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. కాకపోతే, ఇవన్నీ ఏ నిర్దిష్టమైన సిద్ధాంతాన్నీ ఆవిష్కరించలేదు. అయితే, విశ్వసృష్టి (cosmology) మీద వేల సంవత్సరాల క్రితం భారతీయ చింతన దృష్టి సారించడమే ఒక విశేషం. ‘అనీదవాతం స్వధయా తదేకం తస్మాద్ధాన్యన్న పర: కిం చనాస’ (ఋ: 10.8.129) ‘సృష్టికి పూర్వం ఉన్నది భగవంతుడు తప్ప మరెవ్వరూ లేరు. ఆయన తనంతట తానే శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాడు’ అని ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం సృష్టి పూర్వం ఉండే స్థితిని ఆసక్తికరంగా వర్ణించింది.
పురుషసూక్తం ‘పరమాత్మ మనస్సు నుండి చంద్రుడు, చక్షువుల నుండి సూర్యుడు ఉద్భవించారని’ సృష్టిక్రమాన్ని వర్ణించింది. మొదట జన్మించిన వాడు హిరణ్యగర్భుడని, ఆయనే భగవంతుడని, ఆయనే విశ్వానికి అధిపతి అని ‘హిరణ్యగర్భసూక్తం’ (ఋ: 10.8.121) చెబుతున్నది. ఇక తైత్తిరీయ ఉపనిషత్తులో కొంత స్పష్టత కనిపిస్తుంది. ‘సో‚కామయత బహుస్యాం ప్రజాయేయేతి’ ఒకటిగా ఉన్న నేను అనేకములుగా అవుతాను. నన్ను నేనే పుట్టించుకొనెదను అని సంకల్పించుకొని ఆ అవ్యాకృతంగా వున్న బ్రహ్మం ‘తదాత్మానగ్గ్ం స్వయమకురుత’ తనకు తానే ఈ నామరూపాత్మకమైన విశ్వంగా మారాడట. ఈ విశ్వంగా మారే క్రమాన్ని ఉపనిషత్తు ఇలా వివరించింది. ‘తస్మాద్వా ఏతస్మాదా త్మన ఆకాశ స్సంభూత: ఆకాశాద్వాయు: వాయోరగ్ని: అగ్నేరాప: అద్భ్యాపృథివీ: పృథివ్యా ఓషధయ: ఓషధీభ్యోన్నమ్ అన్నాత్పురుష:’ (2.1) బ్రహ్మం నుండి ఆకాశం, దాని నుండి వాయువు, దాని నుండి నీరు, దాని నుండి భూమి, దాని నుండి మొక్కలు, వాటి నుండి అన్నం, దాని నుండి పురుషుడు లేక జీవజాలం పుట్టిందని హృద్యంగా వివరించబడింది.
ఇక్కడ ఒక విషయం వివరించాలి. ఆకాశం జడమైంది. దానికి సృష్టించే శక్తి లేదు. మరి, దాని నుండి జలం ఎలా వచ్చిందనే సందేహం వస్తుంది. బ్రహ్మం ఆకాశాన్ని సృష్టించినప్పుడు దానిలో బ్రహ్మం (material cause) నిక్షిప్తంగా ఉంటుంది. అలా ప్రతి వస్తువులోనూ ఉంటుంది. బయటా, లోపలా ఉండేది బ్రహ్మం అని ముందు చెప్పుకున్నాం కదా. అందువల్ల అంతర్హితంగా, అన్నింటిలోనూ బ్రహ్మం ఉంటూనే ఒకదాని నుండి మరొక దానిని సృష్టిస్తుందని తాత్పర్యం. అయితే, ఈ నామరూపాత్మకమైన సృష్టికి ఆదిమధ్యాంతాలు ఉన్నాయి కనుక నిజమైంది కాదని అద్వైతులు, మన కంటికి కనిపిస్తున్న, మనం వ్యవహరిస్తున్న ప్రపంచాన్ని మిథ్య అనరాదని, అది నిజమేనని విశిష్టాద్వైతులు, ద్వైతులు అంటారు. పరమాత్మతో సృష్టించబడ్డ విశ్వాన్ని మిథ్య అనడం తప్పని వారి వాదన.
దాన్ని కూడా ఒక సిద్ధాంతంగా గౌరవించాలి. సాలెపురుగు నుండి దారాలు ఎలా వచ్చి మళ్లీ దానిలోకే ఎలా వెళ్లిపోతున్నాయో అలాగే, బ్రహ్మం నుండి విశ్వం ఉద్భవించి మళ్లీ బ్రహ్మంలోనే లయం అవుతుందని ‘ముండకోపనిషత్తు’ చెప్తున్నది. జైనులు ఉపనిషత్తులను తిరస్కరించి విశ్వం అణువులతో ఏర్పడిందని అన్నారు. ఎవ్వరి ప్రమేయం లేకుండా విత్తనం చెట్టుగా ఎలా మారుతుందో, గుడ్డు పిల్లగా ఎలా మారుతుందో.. అలాగే, ఈశ్వరుని ప్రమేయం లేకుండానే విశ్వం ఆవిర్భవించిందని నిరీశ్వరవాదులైన బౌద్ధులన్నారు. వైశేషిక దర్శనం తన అణు సిద్ధాంతానికి కొనసాగింపుగానే సృష్టి క్రమాన్ని వివరించింది. బ్రహ్మ పదవీకాలం అయిపోయిన వెంటనే పరమేశ్వరుడు జీవులకు విశ్రాంతి నివ్వాలనుకుంటాడు. వెంటనే జీవులలో అదృష్టశక్తిని ఉపసంహరిస్తాడు. తత్కారణంగా పదార్థాలలోని అణువులు వియోగం చెంది పదార్థాలు శిథిలమవుతాయి. మహాభూతాలైన పృథ్వి, జలం, అగ్ని, వాయువు కూడా నశించి పరమేశ్వరునిలో ఐక్యమవుతాయి.
విడివిడిగా అణువులు, పుణ్యపాపాలతో కూడిన జీవులు, నిద్రాణంగా ఉంటాయి. ‘అదృష్టవదాత్మ సంయోగాదేవ సర్గాదౌ పరమాణూనాం కర్మ’ (వై.సూ.4.2.7) ఆత్మకు, జీవులకు పూర్వజన్మతోగల సంయోగ కారణంగా అణువులలో కర్మానుగుణంగా స్పందన కలుగుతుంది. అప్పుడు జీవుల కర్మానుభవం కోసం మళ్లీ పరమేశ్వరుడు అణువులలో చలనాన్ని కలిగించి, మహాభూతాలను సృష్టించి, సృష్టికార్యం ప్రారంభిస్తే దానిని బ్రహ్మదేవుడు పూర్తి చేస్తాడు. పరమేశ్వరుడే సృష్టికి నిమిత్త కారణం. బ్రహ్మదేవుడు సృష్టిలో ఉత్తముడు. బ్రహ్మకూడా ఆ పదవిని తన పుణ్యంతోనే పొందాడు. ఆ పుణ్యం క్షయం కాగానే, తనతోపాటు సృష్టికూడా లయం అవుతుంది.
మరొక బ్రహ్మ ఆ పదవిని అలంకరిస్తాడు. ఇలా ప్రతి సృష్టికీ ఒక బ్రహ్మ ఉంటాడు. ఇలా సృష్టిని గురించి భారతీయ చింతన ఉపనిషత్తులలోను, దర్శనాలలోనూ ఏ విధంగా ఉన్నా పరమాత్మ సృష్టికర్త అనే భావంతో అన్నీ అంగీకరించాయి. వైశేషికుల సృష్టి వాదాన్ని శంకరాద్వైతం తిరస్కరించింది. దానికి ముఖ్య కారణం అణుసిద్ధాంతంలోని కొన్ని ప్రధానాంశాలను శంకరులు అంగీకరించక పోవడం. అద్వైతానికి అభ్యంతరం కాని భాగాలను శంకరులు అంగీకరించారు. కాగా ఐతరేయ ఉపనిషత్తులో సృష్టిక్రమం ఇలా వర్ణించబడింది...
‘స ఇమాన్లోకానసృజత: అమ్భోమరీచీర్మరమాపోదో
మ్భ: పరేణ దివం ద్యౌ: ప్రతిష్ఠా‚న్తరిక్షం మరీచయ:
పృథివీ మరో యా అధస్తాత్తా ఆప: (1.1.2)
సృష్టి అంటే ఇదేదో కొత్తగా జరిగే మొదటి సృష్టి అనుకోకూడదు. సృష్టి స్థితి లయాలు వృత్తాకార పద్ధతిలో మరల మరల ఆవృత్తమవుతూనే ఉంటాయి. అందువల్లే సృష్టి అనాది. ఇంతకు ముందటి సృష్టి లయకాలంలో ప్రళయం వచ్చి, అంతం అయిపోతుంది. ఆ ప్రళయ సమయం తీరిపోయి, పూర్వపు సృష్టిలోని జీవజాలం వాసనలకు అనుగుణమైన లోకాల సృష్టి జరుగుతుంది. విశ్వాన్ని సృష్టించాలని ఆత్మ ఆలోచించిందనడంలో అర్థం పూర్వోక్త వాసనలు ప్రధానాన్ని ప్రేరేపించగా, సృష్టికర్త చైతన్యాన్ని ఇచ్చి సృష్టి కార్యానికి దోహదపడ్డాడని! అలా ఆలోచించి అంభస్సు, మరీచి, మరం, జలం అనే లోకాలను సృష్టించాడు.
బ్రహ్మం నుండి ఈ విశ్వం ఆవిర్భవించిందనుకున్నాం. అయితే ఈ సృష్టికి ప్రేరణ ఏమిటి? తపస్సుతో బ్రహ్మం ‘ఒకటిగా ఉన్న నేను బహురూపాలతో ఆవిర్భవిస్తాను’ అనుకున్నాడు. అంటే, ఆ బ్రహ్మం ఇచ్ఛామాత్రంతోనే సృష్టి జరిగిందని అర్థం చేసుకోవాలి. అలా సంకల్పించుకున్న బ్రహ్మం నుండి మొదట అన్నం పుట్టింది. ఇక్కడ అన్నం అంటే మనకు ఆహారంగా ఉన్న అన్నం అని అనుకోకూడదు. అన్నం అంటే ప్రకృతి (ఆదిమద్రవ్యం Primordial Material) అని అర్థం. దానిలోనే సత్తరజస్తమో గుణాలు నిక్షిప్తమై ఉంటాయి. ఆ ప్రకృతి నుండి హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. ఆయన నుండి మనస్సు (ఇక్కడ మనస్సు అంటే సమష్టి రూపమైన మనస్సు Cosmic Mind), ఆ మనస్సు నుండి పంచభూతాలు (ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి), వాటినుండి జగత్తు ఉద్భవించాయి.
ఎప్పుడైతే జగత్తు పుట్టిందో అప్పుడే జీవులు, కర్మలు వాటిని అనుభవించడం మొదలైంది. ఈ అక్షర పరబ్రహ్మమే సృష్టికి కారణం. ప్రాణం, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి ఇవన్నీ అక్షర పరబ్రహ్మం నుండి పుట్టినవే. ప్రాణం కూడా దీనినుండే ఉద్భవించిందంటే, అంతకు ముందు ప్రాణం అనేది లేదన్న మాటే కదా. అంటే, అక్షర పరబ్రహ్మానికి ప్రాణం ఆపాదించకూడదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నామరూపాత్మకమైన ఈ విశ్వం అంతా ఆ బ్రహ్మం నుండే వచ్చింది. అందువల్ల ఆ బ్రహ్మాన్ని ఉపాదాన కారణం (Material Cause) అన్నారు. భారతీయ తత్వశాస్త్రంలో బ్రహ్మం నుండి విశ్వం ఆవిర్భవించింది (Projection) అంటారు. తాబేలు నుండి అవయవాలు ఎలా బయటికి వస్తాయో అలాగే. మళ్లీ అవయవాలను తాబేలు లోపలికి తీసుకున్నట్లే ప్రళయకాలంలో విశ్వాన్ని బ్రహ్మం తన లోపలికి తీసుకుంటుంది లేదా తనలో లయం చేసుకుంటుంది.
ముందుగా, ఐతరేయ ఉపనిషత్తు సృష్టికి పూర్వం ఉన్న పరిస్థితిని గురించి మూడు విషయాలను చెప్పింది.
ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్: సృష్టికి పూర్వం ఉన్నది ఆత్మ మాత్రమే.
నాన్యత్కించన మిషత్: కార్యకలాపాలు చేసే ఇతర వస్తువు ఏదీ లేదు.
స ఈక్షత లోకాన్ను సృజాఇతి: విశ్వసృష్టి చేద్దామని ఆ ఆత్మ సంకల్పించింది లేదా ఆలోచించింది. ఇదంతా ఐతరేయ ఉపనిషత్తులోని సృష్టిక్రమం. ఇలా సృష్టి కార్యాన్ని మన ఉపనిషత్తులు వర్ణించాయి.
No comments:
Post a Comment