*🔯శంభాల 360 సొల్యూషన్🔯 *
*🙏🌹 ప్రియమైన నా బంధు,మిత్రులకు,మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*🌹🙏
*ఓ చక్కటి జీవన సత్యం.*
తరగతి గదిలోకి ప్రవేశించి,
రూం అంతా తిరిగి విద్యార్ధులందరినీ ఉద్దేశించి ఎవరూ ఊహించని ప్రకటన చేశారు ఒక మంచి పంతులమ్మ గారు:
“ఇప్పుడు మీ అందరికి ఒక అప్రకటిత రాత పరీక్ష పెడుతున్నాను. ప్రశ్న పత్రాలు మడిచి మీకు ఇస్తాను. అందరికి పంచిన తరువాత నేను చెప్పి నప్పుడు పత్రాలు తెరిచి మీ జవాబులు రాయాలి. సరేనా?”
విద్యార్ధులంతా తలలు ఊపి ఆశ్చర్యం గాను, ఆత్రం గాను ఎదురు చూస్తూ ప్రశ్న పత్రాల పంపకం అయిన తర్వాత పంతులమ్మ గారి అనుమతి కోసం ఎదురుచూస్తారు.
ఆ తర్వాత ప్రశ్న పత్రాలు తెరిచి చూస్తే అందులో ఏమీ లేదు ఒక చిన్న నల్లటి చుక్క తప్ప!
అందరూ తెల్లమొహం వేసుకొని పంతులమ్మ వైపు చూశారు.
ఆమె చిరు నవ్వుతో ఇలా అన్నారు:
“కంగారు పడవద్దు. ఆ కాగితం లో మీరు ఏమేమి చూశారో వాటి గురించి వివరంగా రాయండి. తర్వాత మీ జవాబు పత్రాలు నాకు యివ్వండి”.
ప్రతి విద్యార్థి ఆ చిన్న నల్లటి చుక్క యొక్క రూపు రేఖల గురించి, తెల్ల కాగితం పైన దాని స్థానం గురించి ఎవరికి నచ్చినట్లు వారు రాశారు.
అందరి జవాబు పత్రాలు తీసుకున్న పిమ్మట పంతులమ్మ గారు ఒక్కొక్కటి అందరికీ వినిపించే లాగ గట్టిగా చదివారు.
తరువాత ఏమి జరుగబోతుందోనని ఆశ్చర్యంగాను, నిశ్శబ్ధంగాను ఎదురుచూస్తున్న విద్యార్థులతో పంతులమ్మ ఇలా అన్నారు:
”ఈ పరీక్ష నేను లెక్కలోకి తీసు కోను. కాని ఈ పరీక్ష ద్వారా మీరు నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి…
ప్రతి ఒక్కరు ఆ చిన్న చుక్క పైనే ధ్యాస పెట్టి దానికంటే ఎంతో పెద్దది, ముఖ్యమైనది మరియు మూలమైన ఆ తెల్లకాగితాన్ని విస్మరించడం శోచనీయం.
మన దైనందిక జీవితం లో కూడ ఇటువంటివే ఎన్నో జరుగుతున్నాయి మరియు అనుభవిస్తున్నాము.
అపురూపమైన, అద్భుతమైన,
అందమైన ఈ ప్రపంచం లో
మానవ జన్మ దేవుడిచ్చిన అతి పెద్ద వరం.
అది ఆ తెల్ల కాగితం వంటిది.
ఈ నిజాన్ని మనం సరిగా గ్రహించం, పట్టించు కోము, అర్ధం చేసుకునే ప్రయత్నం కూడ చేయము.
అంత పెద్ద తెల్లకాగితం మీద ఉన్న ఆ చిన్న మచ్చ గురించి మాత్రం మన దృష్టిని సారించి కేంద్రీకరిస్తాము.
దీని అర్ధమేమిటి? మన దృష్టి ఎక్కువగా అపజయం, నిరాశ, అనారోగ్యం, అధిక ధన లేమి, విలాసాల కొరత, బంధు మితృల వలన ఉత్పన్నమయ్యే సమస్యల పైనే ఉంటుంది.
అది సరియైన మార్గం కాదు.
ఈ చర్చ ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే :
జీవించడం ఒక ప్రత్యేకమైన వరం. కనుక ప్రతి అవకాశాన్ని ఆనందంగా అనుభవించండి.
అవకాశాల్ని వదులుకోవద్దు. పరిస్ధితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. స్నేహితులు కాని, ఉద్యోగం కాని, సంపాదన కాని, కుటుంబపరిస్తితులు కాని, ప్రేమ ఆప్యాయతలు కాని మార్పు చెందడం సహజం.
కాని మనం గుర్తించు కోవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే ఆ పెద్ద తెల్లకాగితం పైన చిన్న చిన్న నల్లటి చుక్కలు ఎన్ని ఉన్నా మీ దృష్టి ని వాటినుండి మరలించండి. ప్రతిక్షణము ఆనందంగా ఉండండి. దేవుడు ఈ మంచి వరాన్ని మీకు ప్రసాదించు గాక!
*శుభం భూయత్.*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
No comments:
Post a Comment