Sunday, March 30, 2025

 *మండువ_ఇల్లు*

*పెంకుటిళ్లు మధ్య కాలి స్ధలం నిర్మాణం లో  వాస్తు శాస్త్రం ప్రకారం ఉన్న శాస్ర్తియ విజ్ఞానం (సైన్స్ )*

*పెంకుటిల్లు : ఒక మధ్యరకమైన నివాస స్థలం. ఇవి తండా , పల్లెలలోను, పట్టణాలలోను కనిపిస్తాయి. ఇవి పక్కా గోడలతో కట్టబడి, పైభాగంలో కలపతో నిర్మించి వాటిమీద పెంకులు పరిచి లోపలిభాగాన్ని రక్షిస్తారు.*

*వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్య లో కాలిగా ఉండడం వలన వాస్తు దోషం ఉండదు అని శాస్త్రం చెబుతోంది*

*ఇంటి మధ్యలో సూర్య కిరణాలు పడడం వలన పగలు వెలుతురు  ఉంటుంది*

*ఎండకాలంలో చాలామంది తాము కట్టుకున్న బిల్డింగ్ ,అపార్ట్మెంట్ ,ఇందిరమ్మ గృహలలో అతివేడి వలన ఉడకపోత బరించలేక చెమటతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బు ఉన్నవాలు ఎయిర్ కూలర్  తో అతివేడి నుండి ఉపశమనం దొరుకుతుంది*

*కాని ఏలాంటి ఎయిర్ కూలర్ లేకుండా ఏంత ఉష్ణోగ్రతలు ఉన్న ఈ పెంకుటిల్లు వాతావరణం చల్లగా ఉంటుంది*

*దీనికి కారణం మన పూర్వీకులు వాస్తు శాస్త్ర పండితులు , ఇళ్లు కట్టె మేస్త్రీల గొప్పతనం*

*పెంకుటిల్లు కట్టడం వలన ఆకాశం లో ఉండే సూర్యుని  వేడి కిరణాలు భూమి మీద ఉండే ట్రపోసఫెర్ లేయర్ లో  వాయువు  (ఎయిర్ ) ఎక్కువ గా ఉంటుంది*
*సూర్యుని వేడి కిరణాలు వాయువు కలిసి వేడి గాలులు వీస్తాయి ఈ కారణం చేత ఆకాశం లో అతివేడి ఎర్పడి భూమి మీద మనుషులు కట్టుకున్న గృహం లో  వేడి అంతా వ్యాపింప చేస్తుంది*

*అయితే గృహంలో వ్యాపించిన వేడి బయటకు పోవాలంటే వెంటిలేటర్  సౌకర్యం ఉంటే కనీసం సరిపోతుంది*

*పెంకుటిల్లు మధ్యలో కాలి స్ధలం ఉన్నట్లయితే వేడి మొత్తం వ్యాపించిన గృహంలో అధిక పీడన (హై ప్రెషర్ హుమిడిటీ) తేమ ఎర్పడిన కారణం చేత  పెంకుటిల్లుమధ్య కాలి స్ధలం ఉంటే(స్ధలం పెంకుటిల్లు నిర్మాణ వైశాల్యం కంటే చాలా తక్కువ ఉన్నట్లయితే  ) ఆ వేడి గాలి హై ప్రెషర్ హుమిడిటీ అధిక పీడన తేమ  వల్ల  పెంకుటిల్లు.మధ్య కాలి స్ధలం నుండి ఎక్కువగా పోతుంది.* 

*ఇలాంటి. వెసులుబాటు  బిల్డింగ్ ,అపార్టమెంట్లలో ఉండదు కదా అందుకని అతివేడి తో ఇబ్బంది పడతారు,  డబ్బులు ఉన్నవాలు అయితే ఎయిర్ కూలర్ తో కృత్రిమ ప్రపంచంలో బతుకుతారు*

*ఏ ఏయిర్ కూలర్ లేకుండా సంతోషంగా బతకాలంటే పెంకుటిల్లు మధ్యలో చిన్నగా కాలి స్ధలం ఉంటే సరిపోతుంది (ఆ కాలి స్ధలం పెంకుటిల్లు కట్టిన వైశాల్యం కంటే చాలా తక్కువగా ఉండాలి.)*

*ఇక్కడ పెంకుటిల్లు కి వాస్తు కి సంబంధం చాలా ఉంది.*
*వాస్తు శాస్త్రం అష్టాదిక్పాలకుల పై ఆధారపడి ఉంటుంది (ఇక్కడ వరకు అర్థం చేసుకొండి) .*
 *అందులో వాయువు , కుబేరుడు , ఈశ్వరుడు ,ఇంద్రుడు ,అగ్ని ,యముడు , నైఋతి ,వరుణుడు  ఉంటారు*

*ఇందులో అగ్ని తత్వం వాయు తత్వం అస్తవ్యస్తంగా గృహంలో ఉంటే మనుషులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉదాహరణ: జ్వరం ఎక్కువ అయితే రోగం వస్తుంది కదా*

*అయితే గృహని ఆధారంగా చేసుకొని మనిషి ఆరోగ్యం గా , సంతోషంగా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం పెంకుటిళ్లు మధ్యలో కాలి స్ధలం ఉండాలి.*

No comments:

Post a Comment