Sunday, March 2, 2025

*_మానవుడే మహనీయుడు..!_*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*_కుంభమేళా.._*
_దేవుని ఖేలా..మనిషి లీలా..!_

*_కుంభమేళా.._*
ఇదేదో పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదండోయ్..
మానవతకు అద్దం పట్టిన మహాఘట్టం..
ఎన్నెన్నో గొప్ప కార్యాల దృశ్యమాలిక..
అద్భుతాలకు వేదిక..
మనిషి దేనికైతే దూరమైపోయినట్టు చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నాడో 
అలాంటి సంఘటనలెన్నో సజీవంగా ఆవిష్కారమైన కలియుగ అద్భుతం..
నవయుగ చిత్రం..!

*_కుంభమేళా.._*
కోట్లాది మంది మనుషులు ఒక్కటై శాంతిసామరస్యాలతో జరుపుకున్న మహా వేడుక..
అక్కడ అణువణువునా కనిపించింది 
భక్తి మాత్రమే కాదు..
*_సాయం.. మానవత_*
*_వినయం..విధేయత.._*
*_వినమ్రత.._*

ప్రయాగ..హరిద్వార్..
ఉజ్జయిని..నాసిక్..
ఈ నాలుగు క్షేత్రాలలో
అడుగడుగునా కనిపించింది
భక్తులు కాదు..మనుషులు..

అణువణువునా మానవత్వం నింపుకున్న సిసలైన జీవులు..
అడిగితే సాయం..
అడక్కుండానే సహాయం..
ఏం చేసినా ప్రేమతో..

అక్కడ..తిండికి కొరత లేదు..
అడుగడుగునా స్టాల్స్..
చక్కని ఆహారం..
నువ్వు అడిగితే కాదు..
నీ ఆకలి..
అవసరం తెలుసుకుని ముందుగా సిద్ధం చేసి ఉంచిన ఫలహారాలు..
శుచిగా..శుభ్రంగా..

ఒకరు కాదు..ఇద్దరు కాదు..
వందల కొద్దీ సేవకులు..
లక్షలు కోట్ల మంది యాత్రికులకు..నిర్విరామంగా
సేవ చేసిన అపురూప దృశ్యాలు..
కుంభమేళాలో అడుగడుగునా కనిపించాయి.

*_ఇదెలా సాధ్యం.._*

సంకల్పం..దానికి భక్తి తోడై..
సేవా చింతన ఆయుధమై..
సాక్షాత్కరించిన అద్భుతం.

*_కుంభమేళా_*
చివరి రోజున సుమారు 
పది కోట్లమంది సంచరిస్తున్నా 
ఆహారానికి కొదవలేదు..
ఆదరణకు కొరత కనిపించలేదు..

అన్నా..ఫలానా చోటుకి ఎలా వెళ్లాలి..అని అడిగితే ప్రేమగా చాయ్ ఇచ్చి మరీ త్రోవ చూపించిన వైనం..
అలసి చెట్టు కిందనో.. 
టెంటు నీడకో చేరితే
అక్కడ కూడా సేవకుడు ఆహారంతో ప్రత్యక్షం..

అక్కడ సేవ చేస్తున్నారు కదాని..
నీకు సకల సౌకర్యాలు
సమకూరుస్తున్నారు కదాని..
వారెవరో మామూలు వాలంటీర్లని..
రోజు కూలీకి పని చేస్తున్న వర్కర్లని అనుకునేరు.

ప్లేట్ల కంపెనీ అధినేతలు
అక్కడ ఎంగిలి ప్లేట్లు కడుగుతూ కనిపిస్తారు..
పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు 
నీకు భోజనం తెచ్చి ఇస్తారు..
వందల ఎకరాల భూస్వామి 
ఓ మూల కూర్చుని కూరగాయలు తరుగుతూ ఉంటాడు..

ప్రతి ఇల్లు..సేవా నిలయమే..
ప్రతి చావిడి.. ఆశ్రమమే..
ప్రతి ఆరామం..
నీ అలసటకు విరామమే..
పైసా వసూల్ లేదు..
చార్జి ఉండదు..
జీఎస్టీ  ఊసే వినిపించదు..

ఇది భక్తి మాత్రమే కాదు..
అంతకు మించి..

*_మనవధర్మ ప్రదర్శన.._*
*_మానవతకు పరాకాష్ఠ.._*
*_సాయానికి నిజరూపం.._*

మనిషి.. సాటి మనిషి పట్ల
చూపిన కనీస ధర్మం..
దీని ఛాయలను మొన్న కోవిడ్ 
సమయంలో గమనించాం.
పరాకాష్టను కుంభమేళాలో
ప్రతి యాత్రికుడు అనుభూతించాడు..!

అక్కడ అడుగడుగునా
కనిపించింది.. 

మత ధర్మం మాత్రమే కాదు..
*_మానవ ధర్మం.._*
గెలిచింది మతం 
మాత్రమే కాదు..
మనిషి..
ఆ మనిషిలోని దేవుడు..
అంతిమ విజయం ఆయనదే..
*_పరమేశ్వరునిదే.._*

ఇప్పుడు కదా
మనిషిలోని మనిషిని చూసి..
ఉప్పొంగి ఉరికింది గంగ..
ఇన్నాళ్లుగా మనుషుల పాపాలను కడిగి పునీతం చేసిన గంగమ్మ తల్లి..
తొలిసారిగా 
మనిషిని తాకి 
*_తాను పునీతం అయిందేమో..!_*

✍️✍️✍️✍️✍️✍️✍️✍️

*_సురేష్..9948546286_*

No comments:

Post a Comment